అతను చేయి వేస్తే ఎలాంటి శిలైనా.. అందమైన శిల్పం కావాల్సిందే.. ఎంతటి కరుకు రాయి అయినా.. ఉలి దెబ్బకు కళాత్మకంగా మారిపోవాల్సిందే.. శిల్పకళా రంగంలో తనదైన ముద్ర వేస్తూ.. ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు శిల్ప కళాకారుడు బుద్ది సంతోష్.
మాది కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్. నాకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్, పెయిటింగ్ అంటే ఇష్టం. అలా ఒకసారి ఇంటి దగ్గర ఒకరికి బయాలజీ డ్రాయింగ్స్ వేసి ఇచ్చా.. అవి చూసి మా అన్నయ్య సలహా ఇచ్చారు.. ఫైన్ ఆర్ట్స్ చేయొచ్చు కదా. బొమ్మలు వేయడం ఇంట్రెస్ట్ ఉంటే అని అన్నారు. నిజానికి నాకు ఫైన్ ఆర్ట్స్ అంటే జీరో నాలెడ్జ్. నాకు మాత్రమే కాదు. మా ఏరియాలో చాలామందికి ఇలాంటి ఒక కోర్సు ఉంటుందని తెలియదు.
అలా ఆయన సలహా మేరకు ప్రయత్నిం చాను. విషయం ఏంటంటే.. ఫైన్ ఆర్ట్స్‌లో ఏముంటాయి అనేది కూడా క్లారిటీ లేదు. జస్ట్ జాయిన్ అవుదాం.. చూద్దాం నేర్చుకుందాం అనుకున్నా. అలా ఎంట్రెన్ రాస్తే హెచ్‌సీయూలో సీటు వచ్చింది. అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నా. ఆర్ట్స్ గురించి చదువుకోవడం.. ఆర్ట్స్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి అనేవి బాగా అవగాహనకు వచ్చాయి. పెద్దగా ప్రాక్టీస్ లేకుండానే వచ్చాం కదా.. అందుకే ఏదైనా మొదటి నుంచి నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉండేది.
అలా ఫైన్ ఆర్ట్స్ గురించి తెలుసుకుంటున్న క్రమంలోనే స్కల్పర్ చేయొచ్చు కదా అని మా సీనియర్ అన్నారు. ‘పెయింటింగ్ కంటే స్కల్పర్‌ను గుడ్డివాళ్లు కూడా ఫీల్ అవుతారు’ అని ఆయన అన్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని స్కల్పర్‌లో జాయిన్ అయ్యా.
కైనటిక్ స్కల్పర్ ఇష్టపడతా!
సహజంగా శిల్పాన్ని చూసి ఎవరైన అనుభూతి చెందవచ్చు. దాన్ని ఒక పార్క్‌లో పెడితే పిల్లలు వచ్చి దాని చుట్టూ ఆడుకుంటారు. ఒక మ్యూజియంలో పెడితే దాని ఒకరకంగా చూస్తారు. సైన్స్ ల్యాబ్స్‌లో పెడితే దాని మరోరకంగా చూస్తారు. ఎవరినైనా చాలా ఈజీగా కనెక్ట్ అయ్యేలాగ చేసేది స్కల్పర్ మాత్రమే అని నమ్ముతా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి కాగానే ఫ్రీ లాచింగ్స్, ఇతర ప్రాజెక్ట్స్ చేశా.
అలా ఇదే ఫీల్డ్‌లో కొనసాగుతున్నా. ప్రస్తుతం ‘కీ స్టోన్ ఇంటర్నెషనల్ స్కూల్లో’ ఆర్ట్స్ టీచర్‌గా పనిచేస్తున్నా. మొదట్లో చదువుకుంటూ డబ్బుల కోసం డ్రైవింగ్ కూడా చేసేవాణ్ని. దాంతో పాటు క్యాంపస్ అందించే మెటీరియల్‌తో స్కల్పర్‌లో వాడే క్లే, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రాడ్స్‌కు ఉపయోగించి వర్క్స్ చేసేది. నా వర్క్స్ అన్నీ డాక్టర్ మర్రిచెన్నారెడ్డి కాలేజీలో, స్టేట్ ఆర్ట్స్ గ్యాలరీలో ఉన్నాయి. ఇప్పటి వరకు చాలా వర్క్స్ షాప్స్ చేశాను. స్టేట్ ఆర్ట్స్ గ్యాలరీలో మెటల్ క్రాప్ట్స్ వర్క్, ధోక్రా, లెదర్ ఆర్ట్స్ ఇలా డిఫరెంట్ వర్క్స్ చేశాను.
ఆర్ట్స్‌లో బాగా ఆకట్టుకున్నది మాత్రం కైనటిక్ స్కల్పర్. ఇది నాకు చాలా ఇష్టమైనది. ఎందుకంటే ఈ ఆర్ట్‌లో మూమెంట్ ఉంటుంది. ఒక స్కల్పర్‌లో మూమెంట్ ఉండటం అంటే చాలా తక్కువ. టెక్నికల్‌గా కూడా మనకు కొత్త ఆలోచనలు వస్తాయి. మామూలు స్కల్పర్ అయితే ఒక దగ్గర ప్లేస్ చేస్తాం. ఇది అలా కాదు.. ఎక్కడ పెట్టిన మూమెంట్ ఉండటం వల్ల మనం దాంతో కనెక్ట్ అవుతాం. మన దగ్గర ఉన్న మెటీరియల్‌తో మనం ఏం చేయగలం అనేది ముఖ్యం.
ప్రస్తుతం స్కల్పర్ కు బాగా డిమాండ్ పెరిగింది. కొత్త కొత్త ఆలోచనలతో విద్యార్థులు వస్తున్నారు. డిజైన్స్ కూడా భిన్నంగా ఉంటున్నాయి.