10-02-2025 09:00:24 PM
ఆర్జీయూకేటీ విసిఏ గోవర్ధన్...
బాసర (విజయక్రాంతి): ప్రతి మనిషిలో ఏదో ఒక గొప్ప శక్తి దాగి ఉంటుందని అది పట్టుదలతో నైపుణ్యంతో బయటకు తీస్తే సాధించలేనిది ఏమీ లేదని బాసర ఆర్జీయూకేటీ విసిఏ గోవర్ధన్ అన్నారు. సోమవారం రోజు ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవనంలో జరిగిన అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన ప్రతిష్టాత్మక అన్వేషణ పోటీలో బాసర ఆర్జీయూకేటీ" సోలార్ ఈడు వీల్స్ అనే ప్రాజెక్టు బృందం రెండవ ప్రశంస పురస్కారం అందుకున్నట్లు విసి గోవర్ధన్ తెలిపారు.
ఎలక్ట్రికల్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జావేద్ బృందం ఈ పురస్కారాన్ని గెలిచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విసీ గోవర్ధన్ మాట్లాడుతూ... కృషి పట్టుదలతో అంకితభావంతో పల్లె గ్రామాలలో మొబైల్ క్లాస్ రూమ్ లో సౌర శక్తితో నడిచే తరగతి గదులను తీసుకురావాలనే దృఢ సంకల్పంతో సోలార్ ఈడ్ వీల్స్ అనే ప్రాజెక్టును రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టును విజయవంతం చేసిన జావేద్ బృందాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్ డి మురళీధర్సన్, ఏవోరణధీర్, అధ్యాపకులు రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.