calender_icon.png 6 February, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టాలి

06-02-2025 01:26:35 AM

ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వినతి

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో లోకల్‌బాడీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నోటాకు పదునుపెడుతూ.. నోటాను ఒక ఎన్నికల కల్పిత అభ్యర్థిగా గుర్తించిందని, తెలంగాణలోనూ ఈ అవకాశాన్ని కల్పించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరింది.

ఈమేరకు బుధవారం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి, సోమ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లెల గోవర్ధన్ రెడ్డి, రాష్ర్ట ఎన్నికల కమిషనర్ రాణి కుముదినికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలోని చాలా జిల్లాలలో గ్రామ అభివృద్ధి కమిటీలు పంచాయతీ సర్పంచ్ పదవిని వేలం వేస్తున్నాయని అందుకే నోటా ఒక కల్పిత అభ్యర్థిగా ఉంటే ఏకగ్రీవ ఎన్నికలకు అవకాశం ఉందన్నారు.