calender_icon.png 27 December, 2024 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా భూముల్లో ఇండస్ట్రియల్ కారిడార్ వద్దు

08-11-2024 09:25:47 PM

అక్కడ మేం ఇండ్లు కట్టుకుట్టం

మంత్రి పొన్నం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

అధికారులకు చౌటపల్లి వాసుల ఫిర్యాదు

హుస్నాబాద్,(విజయక్రాంతి): తమ భూముల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని చూస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి వాసులు కోరారు. ఈ మేరకు శుక్రవారం అక్కన్నపేట తహసీల్దార్ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 312లో గతంలో ప్రభుత్వం 150 ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు 5 నుంచి 20 గుంటల వరకు భూమి ఇచ్చిందన్నారు. వాటిని సాగుచేసుకుంటూ బతుకుతున్నామన్నారు.

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ మీదుగా జనగామ వరకు హైవే నిర్మాణం కానుండడంతో, ఆ భూముల్లో తాము ఇండ్లు కట్టుకోవాలనుకుంటున్నామన్నారు. ఇప్పుడు అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు భూములు అప్పగించాలని అధికారులను ఆదేశించారన్నారు. ఆ ఫ్యాక్టరీలతో కాలుష్యం పెరిగి అనారోగ్యాలకు గురవుతామన్నారు. అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు ఆలోచనను మానుకోవాలన్నారు. తమను కాదని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.