calender_icon.png 18 January, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్లు కాదు.. కాలకూట విషం!

18-01-2025 02:07:35 AM

  1. కల్లు సీసాలో కనిపిస్తున్న విష సర్పాలు, బొద్దింకలు
  2. ప్రజల ప్రాణాలతో చెలగాటం.. విషపూరితమైన మత్తు పదార్థాలతో కృత్రిమ కల్లు తయారీ
  3. అబ్కారీ శాఖాధికారుల అండ దందాతోనే అడ్డగోలు వ్యాపారం
  4. ఈదులు లేకుండానే వెలుస్తున్న గల్లీ కల్లు దుకాణాలు
  5. ప్రజల ప్రాణాలకు ముప్పని తెలిసినా పట్టింపు శూన్యం

నాగర్ కర్నూల్, జనవరి 17 (విజయ క్రాంతి) : సహజసిద్ధంగా ఈత తాటి చెట్టు నుండి వెలువడిన కల్లు పేరుతో మత్తు పదా ర్థాలను వాడి అపరిశుభ్ర వాతావరణంలో కత్రిమంగా కల్లు తయారుచేసి అమాయక ప్రజలకు అంటగడుతూ కల్తీ కల్లు వ్యాపారు లు అడ్డగోలుగా దందా సాగిస్తున్నారు.

నిత్య వసర సరుకులు ధరలు పెంచినట్లు కల్లు సీసా ధరలను కూడా అమాంతం పెంచేసి కల్తీ కల్లు వ్యాపారు గల్లా పెట్టెలను నింపేసు కుంటున్నారు. అక్రమంగా తయారీ చేస్తున్న కల్తీకల్లు వ్యాపారం సాఫీగా జరిగేందుకు అండ దండగ వ్యవహరిస్తున్న ఆప్కారి శాఖ అధికారులకు నెలసరి ముడుపులను అప్పజె ప్తున్నట్లు ఆరోపణలు బాహాటంగానే ఉన్నా యి. 

జిల్లాలో ఈత తాటి వనాలు లేకపోయి నా శ్రేష్టమైన కల్లు కేవలం ఈత తాటి చెట్ల నుంచి మాత్రమే వెలువడుతుందన్న విష యాలు జిల్లా ఆ శాఖ అధికారులకు తెలిసిన ప్పటికీ కల్తీకల్లు వ్యాపారమే శ్రేష్టమైనదిగా డంభాచారం ప్రకటించడం వారికి పరోక్ష మద్దతునిస్తున్నట్లు స్పష్టమవుతుంది.

గత గురువారం రాత్రి బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో ఓ రైతు కూలీ తాగు తున్న కల్లు సీసాలో విషపూరితమైన కట్లపా ము దర్శనం ఇచ్చినప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం ఇలాంటి ఘటనలు మామూలేనని చాలా సింపుల్‌గా తీసుకోవ డం చర్చనీయాంశం అవుతుంది.

గత రెండు నెలల క్రితం బల్మూరు మండలం కొండనా గుల గ్రామంలోని ఓ కళ్ళు దుకాణం లో యువకుడు కల్లు సేవించి కొద్దిసేపట్లోనే మతి చెందాడు. ఈ విషయంలో భాదిత కుటుంబ సభ్యులు ఎక్సైజ్ శాఖ అధికారు లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపో వడంతో కల్లు దుకాణాన్ని ధ్వంసం చేశారు.

ఆ మరుసటి రోజు నుంచి తిరిగి యధావి ధిగా కల్లు దుకాణం నడిపించడం ఆప్కారి శాఖ అధికారులకే ఆ ఘనత దక్కింది. దీంతో పాటు మారుమూల పల్లెల్లో కల్తీ కల్లు వ్యాపారులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో సిహెచ్, ఆల్ఫాజూలం, చక్రిన్ వంటి మత్తు పదార్థాలను వినియోగిస్తూ కత్రిమంగా కల్లు తయారు చేస్తూ యువతను కూడా  కల్లు మత్తులోకి దింపుతున్న పరిస్థితి నెలకొంది. 

జిల్లావ్యాప్తంగా టిఎఫ్ టి లైసెన్సులు పొందిన వారు 211 మంది ఉండగా టిసిఎస్ సొసైటీలు 59 ఉన్నాయి. కాగా కల్వకుర్తి మండలం తర్నికల్,  అచ్చంపేట నియోజ కవర్గ జమిస్తాపూర్ వంటి ప్రాంతాల్లో మాత్రమే ఈత తాటివనాలు ఉన్నాయి. నాగర్ కర్నూల్ నియోజకవర్గ కేంద్రంగా కల్తీకల్లు వ్యాపారం అడ్డగోలుగా జరుగుతుం ది. గత బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉండగా కల్తీ వ్యాపారం జోరుగా నడిచింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమ కల్తీ కల్లు వ్యాపారం నిలువరిస్తామని చెప్పుకున్నా అది కార్యరూపం దాల్చలేదు. కిందిస్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి వరకు ముడుపులు ముట్టజెప్పడం వల్లే కల్తీకల్లు వ్యాపారం ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతోందని ఆరోపణలు వెలువెత్తుతు న్నాయి.

ఎక్సైజ్,  పోలీస్ శాఖల వారిగానూ కిందిస్థాయి కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికా రుల వరకు కల్తీకల్లు వ్యాపారం నుండి ముడుపులు అందుతున్నట్లు విమర్శలు ఉ న్నాయి. గత ఏడాది కాలంలో ఎక్సైజ్ శాఖ అధికారులు కేవలం 80 శాంపులను మాత్ర మే సేకరించి 29 కేసులను నమోదు చేయగా అందులో 16 మందిని మాత్రమే అరెస్టు చేసినట్లు రికార్డులు నమోదయ్యా యి.

జిల్లాలో గల్లి గల్లీకి కల్తీకల్లు దుకాణాలు విచ్చలవిడిగా నడుస్తున్నప్పటికీ వాటన్నింటి లోనూ శ్రేష్టమైన కళ్ళే అమ్ముతున్నట్లుగా ఆప్కారి శాఖ పరోక్షంగా మద్దతు ప్రకటిస్తు న్నట్లు ఈ లెక్కలే తేటతెస్తున్నాయి. గురువా రం రాత్రి లట్టుపల్లి గ్రామంలో జరిగిన ఘటన లోను కేవలం శాంపులను సేకరించి చేతులు దులిపేసుకోవడం చర్చనీయాం శంగా మారుతుంది.

నెలసరి ముడుపులు ఇవ్వని దుకాణాల్లో మాత్రమే తరచూ దాడులు నిర్వహించి కేసులు సైతం నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ బీర్ల ధరలు అమాంతం పెరుగుతుండడంతో సామాన్యులు మద్యం నుంచి కల్తీకల్లుకు నాటు సారాను సేవిస్తున్న సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో ఆప్కారి శాఖ అధికారు లు కల్తీకల్లు వ్యాపారుల నుండి వచ్చే వస్తువులపైనే దష్టి సారించినట్లు చర్చ నడు స్తోంది.

కొన్ని ప్రాంతాల్లో కళ్ళు సీసా ధరలు కూడా నిర్ణయించే స్థాయికి ఆప్కారి శాఖ అధికారులు ఎదిగారని విమర్శలు వ్యక్తం అయ్యాయి. కల్తీ కల్లు వినియోగంతో సామాన్యులు ప్రాణాలు గాల్లో కలుస్తు న్నాయని ప్రభుత్వాలకు సైతం తెలిసిన ప్పటికీ పట్టించుకోకపోవడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తరచూ దాడులు జరుపుతున్నాం

కల్తీ కల్లు తయారీ చేస్తున్న దుకా ణాల్లో ప్రజలు ప్రాణాలు హరించేలా మత్తు పదార్థాలు వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా తరచు అక్కడక్కడ కల్లు దుకాణాల్లో దాడులు నిర్వహించి శాంపిళ్లను సేకరిస్తు న్నాం . కల్లు సీసాలో కట్లపాము వ్యవహా రంలోనూ దుకాణంలో శాంపిలను సేక రించి ల్యాబ్ కు పంపాం. వచ్చే రిజల్ట్ ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

 గాయత్రి, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారిని