calender_icon.png 29 October, 2024 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలన కాదు.. ప్రజాపీడన పాలన

29-10-2024 02:22:57 AM

  1. సీఎం వికృత చేష్టలతో విసిగిన ప్రజలు  
  2. మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధ్వజం 

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాం తి): రాష్ర్టంలో 11 నెలల రేవంత్‌రెడ్డి పాలన ప్రజాపాలన కాదని, ప్రజా పీడన పాలనగా కనిపిస్తుందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాజా పరిస్థితులతో సీఎం వికృత రూపం బయటపడిం దని అన్నారు.

ఇప్పటివరకూ ఏ వర్గానికి ఆయన ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రాష్ర్టంలో ఎక్కడ చూసినా ధర్నాలతో అట్టుడుకుతున్నదని, నోటికి వచ్చినట్టు మాట్లడ మే తప్ప ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కొత్త హామీలు అటుంచితే.. మానవీయ కోణంలో కేసీఆర్ ప్రారంభించిన పథకాలను అమలుచేయకపోవడం బా ధకరమని అన్నారు.

బతుకమ్మ చీరెలు, రైతుబంధు లేదని, రుణమాఫీ కొందరికే అయిం దని, పంటలు కొనే దిక్కు లేదని మండిపడ్డారు. పత్తి ఎక్కడైనా రూ.7,521కు కొంటామని చెప్పి మోసం చేశారని, చివరకు క్విం టాల్‌కు రూ.5 వేలకు రైతులు అమ్ముకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. 

సీఎం మెదడులో విషమే.. విజన్ లేదు

బోనస్ అని చెప్పి రేవంత్‌రెడ్డి బోగస్ చేశారని, ప్రభుత్వం తీరుతో ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్‌లో రైతులు రోడ్డెక్కారని, తక్కువ ధరకు వడ్లు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. మక్కలు కొనుగోలు చేసే దిక్కు లేద ని, సోయాబీన్ పంట కొన్నవి కూడా వాప స్ ఇస్తున్నారని ఆరోపించారు.

ఏటా ౨2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యార్థి భరో సా కార్డు ఊసేలేదని, ఫీజు రీయింబర్స్‌మెం ట్ అందక విద్యార్థుల బతుకులు ఆగం అవుతున్నాయన్నారు. సీఎంకు మెదడులో విషం తప్ప విజన్ లేదని, అవగాహన లేక, పరిపాలన రాక రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని దుయ్యబట్టారు.

తాము పోరాటం చేస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, రుణమాఫీ గురించి మాట్లాడితే వికృతంగా మాట్లాడారని ఆరోపించారు. మూసీ అక్రమాలు బట్ట బయలు చేసే ప్రయ త్నం చేస్తే కేటీఆర్ మీద దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. మూసీ అభివృద్ధికి కాదు, అవినీతికి మాత్రమే వ్యతిరేకం అని కేటీఆర్ చెప్పారని గుర్తుచేశారు.

కేటీఆర్ క్యారెక్టర్ దెబ్బ తీసే యత్నం చేశార ని, ఏడాది కూడా పూర్తి కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిందని స్పష్టంచేశారు. రజాకర్ రాజ్యం మాదిరిగా రేవంత్ పాలన ఉందని, కంచెలు లేని పాలన అని చెప్పి ఆంక్షల పాలన తెచ్చారని విరుచుకుపడ్డారు. ప్రజాపాలనపై వ్యతిరేకత వస్తుం టే సమాధానం చెప్పలేక  డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని పునరుద్ఘాటించారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని, రేవంత్‌రెడ్డి తరఫున వకాల్తా పుచ్చుకుం టున్నారని విమర్శించారు. బండి సంజయ్ కేంద్ర సహాయ మం త్రిగా కాదు, రేవంత్‌కు సహాయ మంత్రిగా పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ అదిగో పులి అంటే, బండి సంజయ్ అదిగో తోక అంటున్నాడని పేర్కొన్నారు.