calender_icon.png 8 January, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ

07-01-2025 01:45:56 AM

  1. * ఆరాంఘర్ ఫ్లుఓవర్‌కు మన్మోహన్ సింగ్ పేరు 
  2. * రూ.800 కోట్లతో 6 లేన్లు.. 4 కిలోమీటర్ల పొడవు 
  3. * నగరంలోనే రెండో అతిపెద్ద ఫ్లుఓవర్‌గా గుర్తింపు 
  4. * రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీతో కొట్లాడుతా 
  5. * అసద్‌తో కలవాల్సి వస్తే కలుస్తా : సీఎం రేవంత్‌రెడ్డి 
  6. * ఆరాంఘర్‌జూపార్క్ ఫ్లుఓవర్ ప్రారంభించిన సీఎం

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (విజయక్రాంతి)/ చార్మినార్ : హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదనీ, ఇదే ఒరిజినల్ సిటీ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఓల్డ్‌సిటీ అభివృద్ధి కోసం స్థానిక ప్రజాప్రతినిధులతో త్వరలోనే సచివాలయంలో సమావేశం నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేను అతిపెద్ద ఫ్లుఓవర్‌గా నిర్మాణం చేసుకుం టే.. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరంఘర్ ఫ్లుఓవర్‌ను రెండో అతిపెద్ద ఫ్లుఓవర్‌గా నిర్మాణం చేసుకున్నట్టు తెలి పారు.

రూ.800 కోట్ల వ్యయంతో నాలుగు కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఆరాంఘర్  జూపార్క్ ఆరు లేన్ల ఫ్లుఓవర్‌ను రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. చాంద్రా యణగుట్ట నియోజకవర్గంలో సీవరేజ్ పనుల నిమిత్తం రూ.301 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నగరంలోనే రెండో అతి పెద్ద ఫ్లుఓవర్‌గా నిలిచిన ఆరాంఘర్ జూపార్క్ ఫ్లుఓవర్‌కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే గొప్ప లేక్ సిటీగా, రాక్ సిటీ గా నిజాం అభివృద్ధి చేస్తే కాలక్రమేణా కబ్జాదారుల ఆక్రమణలకు గురైందని ఆవేదన వ్యక్తంచేశారు.

మూసీకి పెద్ద ఎత్తున వరదలు వచ్చిన నేపథ్యంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లను నిజాం నిర్మించి తాగునీటి సమస్య లేకుండా చేశారని కొనియా డారు. నిజాం చేసిన అభివృద్ధిని కాపాడుకుంటే ప్రపంచంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీగా ఉండేదని చెప్పారు. ప్రస్తుతం చిన్న వర్షం కురిసినా వరదలు, ట్రాఫిక్ జాం ఏర్పడుతుందని అన్నారు. 

మూసీకి గోదావరి జలాలు..

మూసీ నదిని తిరిగి పునరుజ్జీవనం చేసుకోవల్సిన అవసరం ఉందని.. హైదరాబా ద్‌కు గోదావరి జలాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. మోదీ హాయంలో ఒక్క కిలోమీటరు కూడా మెట్రో విస్తరణ కాలేదని.. మోదీ మేము వేర్వేరు పార్టీలు అయినప్పటికీ అభివృద్ధి కోసం మాట్లాడుకుంటామని చెప్పారు.

చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీతో మాట్లాడినట్టు గుర్తుచేశా రు. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న మెట్రో రైలు నిర్మాణానికి సహకరించాలని కోరినట్టు తెలిపారు. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థికంగా సహకరించాలని విజ్ఞప్తిచేశారు.

హైదరాబాద్ అభివృద్ధి కోసం మోదీ తో కొట్లాడాల్సి వస్తే కొట్లాడతానని.. అసద్ తో కలవాల్సి వస్తే కలిసి ముందుకు వెళ్తానని స్పష్టంచేశారు. మీరాలం ట్యాంక్‌పై కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తామన్నారు. ఓల్డ్‌సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసే బాధ్యత తనదేనని చెప్పారు.

ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. గత ప్రభుత్వం గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌కు మెట్రో రైలును తీసుకువెళ్లాలని ప్రతిపాదిస్తే, మేం ఓల్డ్‌సిటీ నుం చి శంషాబాద్‌కు తీసుకెళ్తున్నామని అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పడితే హైదరాబాద్ మరింత అభివృద్ది చెందుతుందని ఆశాభా వం వ్యక్తంచేశారు.

ఓల్డ్ సిటీలో తనకు గల్లీగల్లీ తెలుసన్నారు. సంతోష్‌నగర్, చాంద్రా యణగుట్ట మీదుగా ప్రయాణం చేసినట్టు గుర్తుచేసుకున్నారు. ఇంజినీరింగ్, ఐటీ సంస్థలను ఓల్డ్ సిటీలో ఏర్పాటు చేస్తామని చెప్పా రు. హైదరాబాద్ అభివృద్ధియే తమ లక్ష్యమ ని పునరుద్ఘాటించారు. మెట్రో రైల్ నిర్మా ణం, రోడ్ల విస్తరణ, శాంతి భద్రతల పరిరక్ష ణ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే ప్రాధాన్యత అంశాలుగా పెట్టుకున్నామని చెప్పారు.

ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తనకు చిన్ననాటి స్నేహితుడని గుర్తుచేసుకున్నారు. అభివృద్ధి కోసం మజ్లిస్ పార్టీతో కలిసి పని చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

ఓల్ట్‌సిటీలో హిందూ, ముస్లింలు కలిసి మెలిసి ఉంటున్నారు: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ..

ఓల్డ్‌సిటీలో హిందూ, ముస్లిం తేడా లేకుండా కలిసి మెలిసి ఉంటున్నారని చాంద్రాయణగుట్ట నియోజకవర్గం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. మురుగు నీరు, వర్షపు నీరు కలిసి పోకుండా వేర్వురుగా పైపులైన్లు ఏర్పాటు చేయడం బాగుందన్నా రు.

మురుగు నీరును బాగు చేయడానికి ట్రీట్ మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్, సింగపూర్ చేస్తామని చెప్పి.. కనీసం చార్మినార్ పేడేస్ట్రీయన్ ప్రాజెక్ట్ పనులు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు.

ఓల్డ్‌సిటీకి ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి వేలాధి మం ది టూరిస్టులు వస్తుంటారని, అభివృద్ధి పను లు చేపడితే టూరిస్టుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. ప్రభుత్వం తీసుకోచ్చే టూరి స్టు పాలసీలో మక్కా మసీదుతో పాటు ఇత ర మసీదు లను కూడా చేర్చితే బాగుంటుందని సూచించారు.

ఓల్డ్‌సిటీలో కూడా హై రైజ్డ్ అపార్ట్‌మెంట్ కల్చర్ శరవేగంగా వస్తున్న నేపథ్యంలో బస్టాండ్‌ల అభివృద్ధితో పాటు మినీ బస్సులను కూడా నడిపించాలన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. 

హైదరాబాద్ తెలంగాణకు గ్రోత్ సెంటర్‌గా మారింది: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్ నగరం తెలంగాణకు గ్రోత్ సెంటర్‌గా మారిందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. నల్గొండ క్రాస్‌రోడ్ స్టీల్‌బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని కోరారు. ఓల్డ్ సిటీలో మరిన్ని ఫైర్ స్టేషన్లు రావాల్సిన అవసరం ఉందన్నారు. యాకుత్‌పురాలో రోడ్డు వెడ ల్పు పనులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ఓల్డ్ సిటీలో మెట్రో రాక సంద ర్భంగా ఆస్తులు కొల్పొయిన వారికి చెక్కులను పంపిణి చేశామన్నారు. మీరాల మం డి నుంచి రానున్న మెట్రో స్టేషన్ నుండి చార్మినార్ వరకు స్కై వాక్ ఏర్పాటు చేయాలని కోరారు.

రేవంత్‌రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వంట చేసి పెట్టిన వారిని మర్చి పోకుండా వారిని పిలిపించుకొని సహా యం చేయడం మంచి పరిణామం అన్నారు.1998లో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కూడా నన్ను జైల్లో పెట్టించారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంతో ముందుకు నడుస్తోందని ఎంపీ అసదుద్దీన్ స్పష్టం చేశారు. 

ఓల్డ్ సిటీలో ఐటీ టవర్స్ నిర్మిస్తాం: ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు..

హైదరాబాఓద్ నగరం అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేంది ఓల్డ్‌సిటీ అన్నారు. ఆ తరువాతనే ఇతర ప్రాంతాలు గుర్తుకు వస్తాయన్నారు. మేం నిర్మించిన ఫ్లు ఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తున్నారని కొందరు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు అంటున్నారని, కానీ మేం అధికారంలోకి వచ్చిన తరువాతే సరైన సమయానికి నిధులు విడు దల చేసి సకాలంలో ఫ్లు ఓవర్ బ్రిడ్జి నిర్మా ణం పూర్తి చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ సిటీ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.