- రాహుల్‌గాంధీ.. నిజాలు తెలసుకో
- ఎస్‌ఎన్‌డీపీతో రాజధానికి తప్పిన వరద ముప్పు
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): వరద బాధితులకు కావాల్సింది సానుభూతి కాదని.. వారిని ఆదుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా రు. వరదల నుంచి ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం అవిశ్రాంతంగా చర్యలు చేపట్టిందంటూ రాహుల్‌గాంధీ చేసిన ట్వీట్‌పై ఆయ న సోమవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ కేవ లం బాధపడుతున్నట్లు ప్రకటనలు చేస్తే సరిపోదని రాహుల్‌కు సూచించారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటే ప్రభుత్వ నిర్వా కం తెలుస్తుందని చురకలంటించారు.
9 మందిని కాపాడిన జేసీబీ డ్రైవర్
ఖమ్మంలో ఒక జేసీబీ డ్రైవర్ తన ప్రాణాలకు తెగించి 9 మంది ప్రాణాలు కాపాడా రని పేర్కొన్నారు. ఈసందర్భంగా డ్రైవర్‌ను అభినందించారు. వరదలో తల్లి, ముగ్గురు పిల్లలు చిక్కుకుంటే ప్రభుత్వం స్పందించకుంటే మధిర నుంచి వారి బంధువులు గజ ఈతగాళ్లను తెచ్చి ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. వరద బాధితులకు బీఆర్‌ఎస్ నాయకలు, కార్యకర్తలు అండగా ఉన్నారన్నారు. తెలంగాణకు కష్టమొచ్చిందంటే ముందుండేది బీఆర్‌ఎస్సే అని మరోసారి రుజువు చేశామన్నారు. కేసీఆర్ అమలుచేసిన ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమంతోనే హైదరా బాద్‌కు వరద ముప్పు తప్పిందని కేటీర్ పేర్కొన్నారు. గతంలో రాజధానిలో రూ. 985 కోట్లతో 60 పనులు చేపట్టడంతో వర ద ముప్పు తప్పిందన్నారు. వరదల్లో ప్రాణా లు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు నష్ట పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. వారికి రూ. 5 లక్షల నష్టపరిహారం ప్రకటించటం అన్యాయమన్నారు.
రక్షిత మరణంపై అనుమాలు..
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన రక్షిత(16) అనే విద్యార్థిని మృతి చెందిన ఘటనపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ కాలేజీలో హాస్టల్‌లో చేరిన రెండో రోజే రక్షిత బాత్ రూమ్‌లో ఉరి వేసుకుని శవమై కనిపించిందన్నారు. అంతకుముందు రాత్రి తల్లితండ్రులతో ఫోన్ మాట్లాడి అంతా బాగానే ఉందని చెప్పిన అమ్మాయి తెల్లారేసరికి చనిపోవటం అనుమానాలకు తావి స్తుందన్నారు. ఈ సంఘటనపై విచారణ జరిపించి నిజాలు బయటపెట్టాలని ఆయన కోరారు.
డెంగ్యూ నివారణకు చర్యలు..
రాష్ర్టంలో 6 వేల డెంగ్యూ కేసులు నమాదైనా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవ హరిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. గత ఐదారు రోజుల్లో 800 కొత్త డెంగీ కేసులు నమాదైనట్లు గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని విష జర్వాల నివారణ కోసం చర్యలు చేపట్టాలని సూచించారు.