12-02-2025 02:04:59 AM
* మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి
* ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి
కరీంనగర్‌సిటీ, ఫిబ్రవరి11: కరీంనగర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉద్యోగ నిరుద్యోగ పట్ట బద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయని కరీంనగర్ అదిలాబాద్- నిజామాబాద్- మెద క్ పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి వూటుకూరి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలువురు పట్టభ ద్రులను కలసి రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపాలని కోరారు..
పట్టబద్రుల ఎమ్మెల్యే ప్రచారంలో భాగంగా తాను ఉమ్మ డి నాలుగు జిల్లాలలో పర్యటించడం జరిగిం దని.. చాలా సమస్యలు తన దృష్టికి వచ్చా యని తన పర్యటనలో వచ్చిన సమస్యలు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటన్నిటి పరిష్కరి స్తానని పేర్కొన్నారు...
పట్టభద్రులకు ప్రశ్నిం చే గొంతులు అవసరం లేదని సమస్యలు పరిష్కరించే సత్తా ఉన్న నాయకులు కావాల ని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన యేడాది కాలంలోనే నిరుద్యోగ యువతకు 55 వేల ఉద్యోగాలు ఇచ్చి వారికి భరోసా కల్పించారని.. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన జాబ్ క్యాలెం డర్ అమలుకు తాను కృషి చేస్తానని పేర్కొ న్నారు..