calender_icon.png 28 October, 2024 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్తికాదు.. అధికార కుట్ర

28-10-2024 01:04:01 AM

  1. జగన్ మళ్లీ సీఎం కావొద్దనే షర్మిల ఆస్తుల గొడవ
  2. వైఎస్ బతికుండగానే ఆస్తులు పంచారు
  3. షర్మిల వంటి విషపామును ఎక్కడా చేడలే
  4. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

హైదరాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, వైఎస్ షర్మిలి ఆస్తుల తగాదాలో సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఆస్తుల విషయంలో తన పిల్లలపై ప్రమాణం చేసేందుకు సిద్ధమని షర్మిల శనివారం ప్రకటించగా, వైఎస్ జగన్ మళ్లీ ఏపీ ముఖ్యమంత్రి కాకూడదనే కుట్ర లో భాగంగానే ఆస్తుల వివాదాన్ని తెరపైకి తెచ్చారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.

ఆదివారం ఆయన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడు తూ.. షర్మిలది ఆస్తి తగాదా కాదని, అధికారం కోసం తగాదా అని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు కళ్లలో ఆనందం చూడటానికే షర్మిల వైఎస్ జగన్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌కు షర్మిల రాసిన లేఖ చంద్రబాబుకు ఎలా చేరిందని నిలదీశారు.

‘చంద్రబాబు అత్యంత దుర్మార్గు డు. ఆయనతో స్నేహం ఎంతమాత్రం మంచిదికాదు. వైఎస్‌ఆర్ మృతికి కారణమై న కాంగ్రెస్, బాబుతో చేతులు కలుపుతారా? మీ అన్నను జైల్లో పెట్టి హింసించిన కాంగ్రెస్‌లో ఉంటారా? చంద్రబాబు మేలు కోసం సొంత అన్నను మోసం చేస్తారా? ఇలాంటి విషపు పామును ఎక్కడా చూడలేదు. వైఎస్‌ఆర్ ఉన్నప్పుడే జగన్‌కు, షర్మిలకు ఆస్తులు పంచారు.

చెల్లిపై ప్రేమతో జగన్ తన ఆస్తిలో 40 శాతం ఇస్తామన్నారు. కోర్టు కేసుల తర్వాత అది ఇస్తానని చెప్పారు. కానీ మీరు రిటర్న్ గిఫ్టుగా ఏం ఇచ్చారు? షేర్ల బదిలీ డీడ్స్, జగన్ సంతకాలు లేకుండా దొంగ సంతకాలతో నిబంధనలు ఉల్లంఘించారు. జగన్‌ను జైలుకు పంపటానికే చంద్రబాబుతో షర్మిల లాలూచీ పడ్డారు’ అని విజయసాయిరెడ్డి ఆరోపించారు.