మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివుడి పాత్రలో హీరో ప్రభాస్ నటిస్తున్నాడంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు శివుడి పాత్ర లో ప్రభాస్ కాదని తెలుస్తోంది. అక్షయ్ కుమార్ నటిస్తున్నారట. పార్వతీదేవిగా కాజల్ ఖాయమైంది.. ఆమె లుక్‌ను తాజాగా విడుదల చేశారు.
శివుడి పాత్ర లో అక్షయ్ ఫిక్స్ అయితే మరోసారి ఈ జంటను తెరపై వీక్షించే అవకాశం కలుగుతుంది. కాజల్, అగర్వాల్ అక్షయ్ కుమార్ గతంలో ‘స్పెషల్ చబ్బీస్’ అనే చిత్రంలో కలిసి నటించారు. మోహన్‌బాబు, మోహన్‌లాల్, శరత్ కుమార్, ప్రీతి ముకుందన్, మధు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఇదే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.