calender_icon.png 30 January, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గువ్వల కాదు.. గుండా బాలరాజు..!

30-01-2025 01:21:46 AM

  • అహంకారం, అవినీతితోనే ఘోరంగా ఓటమి 

అది జీర్ణించుకోలేక దాడులకు ఆజ్యం- 

అచ్చంపేట ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వంశీకష్ణ హాట్ కామెంట్స్

నాగర్ కర్నూల్, జనవరి 29 (విజయక్రాంతి): గూగుల్లో సెర్చ్ చేసి గూం డా ఎమ్మెల్యే ఎవరని అడిగితే వెంటనే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరా జు పేరే చూపిస్తుందని అహంకారం, అవినీ తి, గుండాయిజం వల్లే తనకు ఆ పేరు వ చ్చిందని అచ్చంపేట ఎమ్మెల్యే, డిసిసి ప్రెసి డెంట్ వంశీకష్ణ గువ్వల బాలరాజు పై హాట్ కామెంట్స్ చేశారు. బుధవారం జిల్లా కేం ద్రంలో నిర్వహించిన మీడియా సమావే శంలో ఆయన మాట్లాడారు.

గువ్వల బాల రాజుకు ఉద్యమంలో పనిచేసిన అనుభవం ఉందన్న ఉద్దేశంతో గత టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు రెండుసార్లు ఎమ్మెల్యే గా అవకాశం ఇచ్చారని కానీ తన అహంకా రం, గుండాయిజం వల్ల ప్రశ్నించిన వారంద రినీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా దాడి చేసి గుండా ఎమ్మెల్యేగా పేరుగాంచాడని అధికా రాన్ని అడ్డం పెట్టుకొని ఇసుక మాఫియా మొదలుకొని గుప్త నిధుల తవ్వకాల వరకు ఘనత తనకే దక్కిందని విమర్శించారు.

గత ఎన్నికల్లో ఈ గుండా యిజాన్ని తరిమికొ ట్టాలని ఉద్దేశంతోనే ఘోరంగా ఓడించారని అయినా ఏమాత్రం మార్పు చెందకుండా తన ఉరికిని కాపాడుకోవాలన్న అక్కసుతో రైతులు, ప్రజల మధ్య చిచ్చు పెట్టి గొడవల కు ప్రేరే పిస్తున్నాడని ఆరోపించారు.

తాజా గా మార్కెటింగ్ శాఖ కార్యాలయం దాడి విషయంలో టిఆర్‌ఎస్ నేతల హస్తం దాగి ఉందని ప్రాథమికంగా అంచనాకు వచ్చిన ట్లు పేర్కొన్నారు. రైతులు ఎవరు టిఆర్‌ఎస్ నేతల మాయలో పడొద్దని ఏవైనా సమస్య లు ఉంటే నేరుగా తనను కలవచ్చునని సూ చన చేశారు. వారితోపాటు స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి తదితర పార్టీ నేతలు ఉన్నారు.