నందమూరి బాలకృష్ణ 109వ చిత్రం ‘ఎన్‌బీకే109’గా రూపొందుతోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే చిత్ర టైటిల్‌ను మాత్రం ఇప్పటి వరకూ ప్రకటించలేదు. బాలయ్య అభిమానులు చిత్ర టైటిల్ కోసం ఎంతగానో నిరీక్షిస్తున్నారు.
వారి నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. దీపావళి సందర్భంగా టైటిల్‌తో పాటు టీజర్‌ను కూడా చిత్రబృందం విడుదల చేయనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాతలు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.
గుర్రంపై స్వారీ చేస్తూ రాజసం ఉట్టి పడేలా బాలయ్య లుక్ ఆ పోస్టర్‌లో ఉంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
16న బీబీ4 గ్రాండ్ లాంచ్..
బాలకృష్ణ, బోయపాటి శ్రీను, రామ్ ఆచంట, గోపీ ఆచంట, 14 రీల్స్ ప్లస్, ఎమ్ తేజస్విని నందమూరి కొలాబరేషన్‌లో చిత్రం ప్రారంభం కానుంది. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 16న బీబీ4 చిత్రం గ్రాండ్‌గా లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు దసరా సందర్భంగా మేకర్స్ ప్రకటించారు.