calender_icon.png 25 October, 2024 | 1:52 AM

కూల్చివేతలే కాదు.. సహాయక చర్యలూ చేపడతాం

02-09-2024 12:57:00 AM

హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్1 (విజయక్రాంతి): ఎడతెరిపి లేకుండా కురు స్తున్న వర్షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నగరంలోని పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ పర్యటించారు. షేక్‌పేట్, టోలీచౌకి, బేగంపేటలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. హైడ్రా కేవలం అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే కాదు, ఆపద, అత్యవసర కాలం లోప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు.

విధి నిర్వహణలో ఉన్న జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్, విపత్తునిర్వహణ అధికా రులు సమన్వయంతో పనిచేస్తు న్నారని.. నగరవాసులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వివిధ సర్కిళ్ల నుంచి డీఆర్‌ఎఫ్‌కు 139 ఫిర్యాదులు అందినట్లు  తెలిపారు. వాటిలో 129ఫిర్యాదులను పరిష్కరించగా.. మరో 10 ఫిర్యాదు లు పురోగతిలో ఉన్నట్లు పేర్కొన్నారు.  కాగా నీళ్లు నిలిచాయని 24 ఫిర్యాదులు, 115 చోట్ల చెట్లు విరిగిపడ్డాయని ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు.