19-04-2025 01:36:56 AM
విత్తనాల కొనుగోలులో రైతులు మోసపోకూడదు
జిల్లా ఎస్పీ డి జానకి
మహబూబ్ నగర్ ఏప్రిల్ 18 (విజయ క్రాంతి) : తక్కువ ధరకు వస్తున్నాయి కదా అంటూ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోకూడదని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. నకిలీ విత్తనాలు ఎక్కడ విక్రయించిన ఫిర్యాదు చేయాలని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటించారు. నిర్లక్ష్మ అనే మాటకు తావు లేకుండా నకిలీ విత్తనాలు ఎక్కడ లభించిన విక్రయించేందుకు సహకరించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన కంపెనీలతో పాటు లేబుల్ని కూడా పక్కాగా చెక్ చేసుకోవాలని సూచించారు.
ఇలాంటి సందేహాలు ఉన్న వ్యవసాయ శాఖ అధికారులను కూడా సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. గ్రామాల్లోకి వచ్చి మంచి విత్తనాలు అంటూ ఎవరైనా అమ్మితే ఒకసారి చెక్ చేసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో మోసపోయి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టం వాటిల్లకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం రైతులపై ఎంతైనా ఉందని తెలిపారు. నివారణకు పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని సూచించారు.