రామగిరి క్రిస్మస్ వేడుకల్లో కాంగ్రెస్ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు
రామగిరి (విజయక్రాంతి): మీకు సార్లం కాదూ.. మేము మీ సేవకులమని, రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు శ్రీను బాబు పేర్కొన్నారు. రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని చర్చి ఎంసిపిఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రిస్మస్ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్ని, రాష్ట్రంలో క్రిస్మస్ డిసెంబర్ 25న, సంక్రాంతి జనవరి 14న వస్తాయని వీటిలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన వివరించారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు రోడ్డ బాపు, ప్రముఖ న్యాయవాది చందుపట్ల రమణ కుమార్ రెడ్డి, నాయకులు వనం రామచంద్రరావు, వెంకటరమణారెడ్డి, ముత్యాల శ్రీనివాస్ కాటం సత్యం, తీగల సమ్మయ్య, బండారి సదానందం, కొప్పుల గణపతి, మట్ట రాజ్ కుమార్, తులసి రామ్ గౌడ్, బత్తుల రమేష్, బంకు మల్లేష్, కుంట చక్రి, గిరవెన ప్రవీణ్ యాదవ్, కనవేన సదానందం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.