calender_icon.png 5 April, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న బియ్యం కాదు.. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే

05-04-2025 12:51:24 AM

  • బీఆర్‌ఎస్ పాలనలో మంచి వెతికిన దొరకదు 

సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి 

మహబూబ్ నగర్ ఏప్రిల్ 4 (విజయ్‌క్రాంతి) : ప్రజలకు సన్న బియ్యం అందించడం కాదు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం చిన్న చింతకుంట ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా చేపట్టిన జై బాపు, జై భీం, జై సంవిధాన్ పాదయాత్ర లో పాల్గొని, మండల కేంద్రంలో, భూత్పూర్ మండలం పరిధిలోని గోపులాపూర్ గ్రామంలో సన్న బియ్యం పథకాన్ని   దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సంపూర్ణ భోజనం అందించాలనే సంకల్పంతో ప్రతి రేషన్ షాప్ ద్వారా సన్న బియ్యం అందించే అద్భుత కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎక్కడ ఇచ్చారో వారికి కూడా సరిగ్గా తెలియదన్నారు.

చేసిందేమీ లేక బిఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డు తగలాలని చూస్తున్నారు, మీ ఆగడాలను చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.