calender_icon.png 16 March, 2025 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులే కాదు.. నాయకులు కూడా!

16-03-2025 12:50:33 AM

  • ఇష్టమొచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు
  • ఎమ్మెల్యే కూనంనేని 

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): ఈ మధ్య జర్నలిస్టులే కాదు.. రాజ కీయ నాయకులు కూడా ఇష్టమొచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారని సీపీఐ ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. గత పదేళ్లుగా ఈ విధానం పెచ్చుమీరిందని.. ఈ పద్ధతిని అరికట్టాలని కోరారు. అందు కోసం అవసరమైతే చట్టాలను కూడా సవరించేలా సభలో చర్చ జరగాలన్నారు. ఏవై నా తప్పులుంటే విమర్శించాలిగానీ, ఇష్టానుసారంగా దూషించకూడదని విజ్ఞప్తి చేశారు.

శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ భద్రాద్రి జిల్లా పాల్వంచ సమీపంలో విమానాశ్రయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముం దడుగు వేయాలని కోరారు. వరంగల్ మా మునూరులో నిర్మించనున్న ఎయిర్‌పోర్టు తరహాలోనే అక్కడా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు.

రామగుండం, కొత్తగూడెంకు ఎయిర్‌పోర్టులు రాకుండా కుట్ర జరు గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం కష్టపడుతున్నప్పటికీ, ఆయన్ను ప్రజా ప్రతినిధులు నేరుగా కలిసేందుకు సమన్వయలోపం వస్తుందన్నారు. ఈ కారణంగానే మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఇటీవల సీఎంను కలిసేందుకు వచ్చి వెనుదిరిగారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.