calender_icon.png 30 October, 2024 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంట్ ఛార్జీలు పెంచకపోవడం ప్రజల విజయం

30-10-2024 02:14:48 AM

ఛార్జీల పెంపు తిరస్కరణపై కమిషన్‌కు కేటీఆర్ ధన్యవాదాలు 

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పాదించిన విద్యుత్ ఛార్జీల పెంపును తిరస్కరించినందుకు తెలంగాణ విద్యు త్ నియంత్రణ కమిషన్ చైర్మన్ రంగారావు, సభ్యులు మనోహర్‌రాజు, కృ ష్ణయ్యకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో ప్రజలపై రూ.18,500 కోట్ల అదనపు భారాన్ని  మోపే ప్రయత్నాన్ని బీఆర్‌ఎస్ వ్యతిరేకించిందన్నారు. హైదరా బాద్, నిజామాబాద్, సిరిసిల్లలో జరిగిన మూడు బహిరంగ విచారణలలో తాము విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను తాము వ్యతిరేకించామన్నా రు. ఛార్జిలను పెంచకపోవడం  ప్రజల విజయమని పేర్కొన్నారు.