calender_icon.png 1 February, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫాంహౌజ్‌లో కాదు.. ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడండి

01-02-2025 01:43:09 AM

  1. పిట్టలదొర వ్యాఖ్యలు మానండి..
  2. అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలపై గళమెత్తండి
  3. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 
  4. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు కౌంటర్

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): ‘రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమ లు కావడం లేదని ఫాంహౌజ్‌లో కూర్చొని కాదు.. ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడండి’ అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో హితవు పలికారు.

ప్రతిపక్షనేతగా అసెంబ్లీ ముఖం చూడని కేసీఆర్, ఇప్పుడు తన తన ఉనికిని చాటుకునేందుకే తుపాకీ రాముడిలా, పిట్టల దొరలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను వాడుకుంటు న్నదని కేసీఆర్ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తు న్నారని అభిప్రాయపడ్డారు. నిజానికి ముస్లిం లను వాడుకుని, వారిని వదిలేసిన చరిత్ర కేసీఆర్‌దేనని విమర్శించారు.

ప్రతిపక్ష నేత ప్రజల మధ్య ఉండాలని, కానీ.. కేసీఆర్ వర్షాలు వచ్చినా, వరదలొచ్చినా కేసీఆర్ ఫాంహౌస్‌ను దాటి బయ టకురాలేదని, పదేళ్లు అధికారంలో ఉండి కూడా కనీసం సచివాలయంలో అడుగుపెట్టలేదని గుర్తుచేశారు. ‘ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్‌కు ఓటేశారు’ అని ఇటీవల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

ప్రజలపై కేటీఆర్‌కు ఏమాత్రం గౌరవం లేదని, ప్రజాతీర్పును ఆయన అగౌరవపరిచారని మండి పడ్డారు. ప్రజలు గడీల పాలన తమకు వద్దనుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కరెంట్ కోతలున్నాయని కేసీఆర్ చెప్తున్నారని, తన ఫాంహౌస్‌లో కరెంట్ కోత ఎప్పుడైందో చెప్పాలన్నారు. తాము గురుకులాల సందర్శనకు వెళ్తున్నామని,  కేసీఆర్ కూడా వాటి సందర్శనకు వస్తే బాగుంటుదని, సందర్శనకు కేటీఆర్‌ను సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నా రు.