calender_icon.png 21 January, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పని ఒత్తిడైతే కాదు

20-09-2024 01:15:51 AM

  1. అందరితోపాటు ఆమెకూ వర్క్ ఇచ్చాం
  2. సంస్థ చైర్మన్ రాజీవ్ 

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: తమ సంస్థలో ఈ ఏడాది జూలైలో 26 ఏళ్ల ఉద్యోగిని అన్నా సెబాస్టియన్ ఆత్మహత్య పని ఒత్తిడి వల్ల జరిగింది కాదని ఎర్న్స్ అండ్ యంగ్ ఇండియా చైర్మన్ రాజీవ్ మెమానీ స్పష్టం చేశారు. అందరితోపాటే అన్నాకు పని కేటాయించామని, పని ఒత్తిడి ఆమె ప్రాణాలు బలిగొనే అవకాశం లేదని కొట్టిపారేశారు. మా వద్ద లక్ష మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలనే రూలేమీ లేదు. అన్నా మాతో 4 నెలలు మాత్రమే పనిచేశారు.

ఆమెకు ఇతర ఉద్యోగుల మాదిరే పని కేటాయించాం. పని ఒత్తిడే ఆమె మరణానికి కారమమని మేం నమ్మడం లేదు  అని మెమానీ చెప్పారు. ఈ విషయం సంస్థ యజమానికి బాధితురాలి తల్లి శోకతప్త హృదయంతో లేఖ రాయగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలోనూ ఈ లెటర్ వైరల్‌గా మారింది. అన్నా ఉద్యోగం లభించగానే ఎగిరి గంతేసిందని ఆమె తల్లి తెలిపారు. స్కూల్, కాలేజీల్లో మంచిగా చదివేదని, అన్ని పరీక్షల్లో టాప్ ర్యాంక్ సాధించేదని వెల్లడించారు. కానీ ఉద్యోగంలో సవాళ్లను ఎదుర్కోలేకపోయిందని వివరించారు.