11-02-2025 01:03:48 AM
* పరీక్షపే చర్చలో ప్రధాని మోదీ
* ఢిల్లీలో నిర్వహణ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: 8వ ఎడిషన్ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ఢిల్లీలోని సుందరవనంలో నిర్వహించారు. 2018లో మొదలైన ఈ కార్యక్రమం ఈసారి 8వ ఎడిషన్. ఈ కార్యక్రమం కోసం అనేక మంది వి ద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. కేవలం 36 మందితో మాత్రమే ప్రధాని నేరుగా సంభాషించారు. మిగతా వారు వర్చువల్‌గా పాల్గొన్నా రు. పరీక్షల్లో ఒత్తిడి, సన్నద్ధత మొదలగు విషయాల గురించి ప్రధాని విద్యార్థులతో మాట్లా డారు. 3 కోట్ల మందికి పైగా ఈ కార్యక్రమం కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ఫోకస్.. ఫోకస్
‘చదువుల గురించి ఎక్కువగా ఒత్తిడి తీసుకోవద్దు. క్రికెట్ స్టేడియంలో ఎంతో మంది ప్రేక్ష కులు ఉన్నా కానీ ఒక బ్యాటర్ ఆట మీద ఎలా ఫోకస్ చేస్తాడో విద్యార్థులు చదువులపై అలా ఫోకస్ చేయాలి. బౌండరీ కొట్టేందుకు బ్యాటర్ తరువాతి బంతి కొరకు ఎలా ఎదురుచూస్తాడో.. విద్యార్థులు కూడా పరీక్షల కోసం అలా ఎదురుచూడాలి. పరీక్షలే జీవితం కాదు.
మనం ఏం మరమనుషులం కాదు. ప్రతి ఒక్కరూ టాపర్‌లా మారాలనేం లేదు. కొందరికి కొన్ని రంగాల్లో మంచి ప్రతిభ ఉంటుంది. వారు ఆ రంగాల వైపు మళ్లాలి. చదువు అనేది మన అభివృద్ధి కోసమే’ అని పేర్కొన్నారు. విద్యార్థులను వారి సమయపాలన గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ఇతరులతో పోల్చడం ఆపాలని ప్రధాని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. వారికి మద్ధతుగా నిలవాలని కోరారు.
మోదీ నోట సచిన్ మాట..
ప్రధాని మోదీ విద్యార్థులతో మాట్లాడుతూ.. లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గురించి ప్రస్తావించారు. ‘సచిన్‌కు చిన్నప్పటి నుంచి చదువుల కంటే ఎక్కువగా ఆటలంటేనే ఇష్టం. అది గమనించిన ఆయన తల్లిదండ్రులు ఆయన్ను ఆటలవైపు ప్రోత్సహించారు. అందుకోసమే ఆయన ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు’ అని మోదీ పేర్కొన్నారు. కేరళ నుంచి వచ్చిన ఓ విద్యార్థి హిందీలో రాసిన కవితను ప్రధానికి వినిపించారు.