calender_icon.png 29 November, 2024 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాలు కాదు.. ఫామ్‌హౌస్ బాట పట్టాలి

29-11-2024 02:10:16 AM

ఆర్‌ఎస్‌పీకి ఎమ్మెల్యే కవ్వంపల్లి సూచన 

హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ గురుకులాల బాటకు బదులు ఫామ్‌హౌస్ బాట పట్టాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. గాంధీభవ న్‌లో గురువారం ఆయన మీడియా తో మాట్లాడుతూ.. ఆర్‌ఎస్పీ గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు తన అనుచరులకే భవనాలు కేటాయించి పెద్ద మొత్తంలో స్కామ్‌కు పాల్పపడ్డారని.. ఆయన ఆధ్వర్యంలోనే గురుకు లాలు భ్రష్టుపట్టాయని ఆరోపించా రు.

గతంలో గురుకులాలను సక్రమంగా నిర్వహిస్తే ఇన్ని ఇబ్బందులు వచ్చేవా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో మౌలిక వసతుల పేరుతో వందల కోట్ల అవినీతి జరిగిందని, పూర్తిస్థాయి విచారణ జర పాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరతామని కవ్వంపల్లి స్పష్టం చేశారు.

అందరు ఒకే దగ్గర చదువుకోవాలని కాంగ్రెస్ గురుకులాలను తీసుకొస్తే.. బీఆర్‌ఎస్ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉన్నదని.. ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.