18-04-2025 12:00:00 AM
జాతీయ విద్యా విధానంలో వక్తలు
హైదరాబాద్, ఏప్రిల్ 167 (విజయక్రాంతి): రాష్ట్రాలకు తమ విద్యా విధానాన్ని నిర్ణయించే హక్కును కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని వక్తలు అభిప్రాయపడ్డారు. గురువారం తెలంగాణ విద్యా కమిషన్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా విధానం 2020 అమలుపై సెమినార్‌ను నిర్వహించింది. ఈ సదస్సుకు ప్రముఖ విద్యా వేత్తలు, సామాజిక కార్యకర్తలు, ఎన్జీవోలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ చైర్‌పర్సన్ ప్రొ.శాంత సిన్హా మాట్లాడుతూ.. ఎన్‌ఈపీపై రాష్ట్ర ప్రభుత్వాలతో, పార్లమెంట్‌లో చర్చించలేదని.. దీనిని కేంద్ర మంత్రివర్గమే ఆమోదించిందన్నారు. ఈ విధానం భారతీయ విద్యావ్యవస్థ వాస్తవాలు, అవసరాలకు అనుకూలంగా లేదన్నారు.
ప్రభుత్వ నిధులతో నడిచే విద్యావ్యవస్థను కూల్చివేసి, ఈ వ్యవస్థను నిర్వహించే భారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులపై మోపడం లక్ష్యంగా పెట్టుకున్నదే ఎన్‌ఈపీ అని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు. విద్యావిధానాన్ని నిర్ణయించే పూర్తి స్వేచ్ఛను రాష్ట్రాలకు కేంద్ర ఇవ్వడంలేదని ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్ పేర్కొన్నారు.