కెనడాలో ఖలిస్థానీలపై ప్రధాని ట్రూడో కీలక వ్యాఖ్యలు
టొరంటో, నవంబర్ 9: ఒట్టావా పార్లమెంట్ హిల్‌లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్థానీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు ఉన్నారని, అయితే వారంతా సిక్కు మతస్థుల సమూహానికి ప్రాతినిధ్యం వహించరని పేర్కొ న్నారు. అలాగే కెనడాలో ప్రధాని నరేంద్ర మోదీకి హిందూ మద్దతుదారులు ఉన్నారని.. అయితే వారంతా కెనడాలోని మొత్తం హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహించడం లేదని ట్రూడో స్పష్టం చేశారు. గతవారం కెనడాలోని బ్రాంప్టన్‌లోని ఓ ఆలయంలో హిందూ భక్తుడిపై ఖలిస్తానీ తీవ్రవాడులు దాడి చేశారు. ఆ సమయంలో భారీ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. అయితే ఆ ఘటనను ప్రధాని ట్రూడో ఖండించారు. కెనడా లో స్వేచ్ఛగా ప్రతిఒక్కరూ మత విశ్వాశాలను పాటించవచ్చు అని అన్నారు.