calender_icon.png 13 November, 2024 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ మనవళ్లకూ సాధ్యం కాదు

10-11-2024 02:07:17 AM

370 పునరుద్ధరణ ప్పటికీ జరగదు

జార్ఖండ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా

రాంచీ, నవంబర్ 9: జమ్ముకాశ్మీర్ ప్రత్యేక హోదాకు సంబంధించిన ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన శనివారం పాలము ప్రచార ర్యాలీలో పాల్గొని కశ్మీర్ ఇండియాలో భాగమని పునరుద్ఘాటించారు. ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావడం మీ నాలుగో తరానికి కూడా సాధ్యం కాదని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ హెచ్చరించారు. 

ఓబీసీ కోటాకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆరోపించారు. 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మహారాష్ట్రలో మైనార్టీ నాయకులకు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని విమర్శించారు. ఓబీజీ, గిరిజన, దళితుల రిజర్వేషన్లను తగ్గించి మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు ప్రధాని మోదీ, బీజేపీ వ్యతిరేకమని తేల్చి చెప్పారు.