మిల్క్ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎంతోకాలంగా ఈ జంట డేటింగ్‌లో ఉన్నప్పటికీ.. పెళ్లి గురించి ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. బహిరంగంగా చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నప్పటికీ ఆ విషయం గురించి మాత్రం ఎక్కడా మాట్లాడటం లేదు. అయితే తాజాగా తమన్నా హైదరాబాద్‌లోని ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంకు హాజరైంది. ‘విజయ్ వర్మతో మీ పెళ్లి ఎప్పుడు’ అని అడగ్గా.. తమన్నా స్పందిస్తూ.. ‘ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోవడం లేదు, కంగారు పడకండి’ అంటూ కామెంట్స్ చేసింది. ఆమె వ్యాఖ్యలతో ఫ్యాన్స్ సైతం కంగారు పడ్డారు.
ఇక బాలీవుడ్‌లో ఎదుగుతున్న స్టార్ విజయ్ వర్మ తమన్నా భాటియాతో తనకున్న రిలేషన్ షిప్ గురించి నిర్మొహమాటంగా చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ‘మేమిద్దరం కలిసి సమయాన్ని ఆస్వాదించి, ఒకరినొకరు ఇష్టపడితే, దానిని దాచడానికి ఎటువంటి కారణం లేదని మేం భావించాము‘ అని అన్నారు. తమన్నా హిందీలో హీరోయిన్‌గా మాత్రమే కాకుండా అతిథి పాత్రలతో అలరిస్తుంటే.. విజయ్ మర్మ మాత్రం వైవిధ్యమైన సినిమాలతో అలరిస్తున్నాడు.