calender_icon.png 30 November, 2024 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలన కాదు.. పోలీస్ రాజ్యం

25-09-2024 01:38:53 AM

సర్కారు తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులా? 

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి

నల్లగొండ, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాల న కాదని.. పోలీస్ రాజ్యమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి విమర్శించారు. మిర్యాలగూడ పట్టణం లోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని, మీడియా ప్రతినిధులను సైతం నిస్పక్షపాతంగా వార్తలు రాయనివ్వడ ం లేదని ఆక్షేపించారు. తొమ్మిది నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని వ్యవస్థ లన్నింటినీ నాశనం చేసిందని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఇద్దరు మంత్రులకు సంపాదనపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదన్నారు.

మంత్రుల నిర్లక్ష్యం కారణ ంగా సాగర్ నీరు వృథాగా సముద్రం పాలవుతున్నదని పేర్కొన్నారు. మంత్రి తుమ్మల అత్యాశ కారణంగానే సాగర్ ఎడమ కాల్వకు రెండుసార్లు గండిపడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ తీసుకువచ్చిన 33 జీవోతో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోని వైద్య విద్యార్థుల కు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్య క్తం చేశారు.

వైద్య విద్య ప్రవేశాలపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి నాలుగురోజుల గడుస్తు న్నా కౌన్సెలింగ్ ఊసేలేదన్నారు. ప్రవేశాలు కల్పిస్తారా? లేదా సర్కారు సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.