- అబద్ధానికి అంగీలాగు తొడిగితే రేవంత్‌రెడ్డి
- రాహుల్‌గాంధీకి లేఖ రాసి బండారం బయటపెడ్తా
- రూ.లక్ష కోట్ల అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
- రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం
- తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయ క్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా.. తమ హయాం లో చేసిన అప్పులపై సీఎం రేవంత్‌రెడ్డి మా ట్లాడటంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప్డడారు. తమ ప్రభుత్వం చేసి న అప్పులు మీద కాదని, కాంగ్రెస్ ఏడాది పాలనలో చేసిన తప్పుల గురించి చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏడాది పాలనలో రూ.లక్ష కోట్ల అప్పులు చేశానపి విమర్శించారు. అబద్ధానికి అంగీలాగు తొడిగితే రేవంత్‌రెడ్డిలా ఉంటారని ఎద్దేవా చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం లో కేటీఆర్ మాట్లాడుతూ సీఎం చేసిన అ ప్పులపై చర్చ జరగాల్సిన అవసరం ఉంద న్నారు.
రేవంత్‌రెడ్డి సోదరులు రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టే స్థాయికి వెళ్లారని, పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఏడాది వారు ఫోర్బ్స్ జాబితాలో చేరుతారన్నారు. గడిచిన ఏడాది లో తమ పార్టీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొందని, అయినా తమ కార్యకర్తలు ధైర్యం గా నిలబడ్డారని చెప్పారు. తెలంగాణ రైజింగ్ అంటూ కొత్త నాటకానికి ప్రభుత్వం తెరలేపిందని కేటీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ రైజింగ్ కాదని, అనుముల బ్రదర్స్ రైజింగ్ అని స్పష్టం చేశారు.
అప్పులంటూ కారుకూతలా?
రేవంత్‌రెడ్డి తాను చేసిన తప్పులను దాచుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఏడాది పాలనలో సాధించిన విజయాల గురించి, ఆరు గ్యారంటీలు, 420 హామీలు గురించి చెప్పాల్సింది పోయి అప్పులంటూ కారు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చే సిందని, తాము శ్వేతపత్రంతో సమాధానమిచ్చామన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాది కి 2లక్షల ఉద్యోగాలిస్తామని నాడు అశోక్‌నగర్‌లో రాహుల్‌గాంధీ ప్రకటించారని, కానీ ఏడాది పాలనలో ఇచ్చింది కేవలం 12వేలు మాత్రమేనని పేర్కొన్నారు. ఈ విషయంపై రాహుల్‌గాంధీకి లేఖ రాసి.. రేవంత్‌రెడ్డి బండారం బయటపెడ్తామన్నా రు. రుణమాఫీ కింద రైతులకు రూ.11వేల కోట్లు కూడా అందలేదని స్వయంగా డిప్యూ టీ సీఎం భట్టి చెప్పారన్నారు.
2014కు వర కు 60 సంవత్సరాల్లో రాష్ట్ర అప్పు రూ.72, 658 కోట్లు ఉంటే, రేవంత్ సీఎం అయ్యాక కేవలం 11 నెలల్లో రూ.లక్ష కోట్లు చేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం రూ.100 ఖ ర్చు పెడితే.. రూ.74 అభివృద్ధికే కేటాయించామన్నారు. రూ.7లక్షల కోట్ల అప్పు అన్నది అతిపెద్ద అబద్ధమన్నారు. సర్కారు కట్టాల్సిన అవసరం లేని అప్పులు పోను తాము తీసుకున్న రుణం కేవలం రూ.4,26,499 కోట్లేన న్నారు.
ప్రతినెలా రూ.6,500 కోట్లు వడ్డీలు, అప్పులు కడుతున్నామని ఇటీవల సీఎం చేసి న వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. 2024 డిసెంబర్ 3నాటికి కాంగ్రెస్ ప్రభు త్వం ఆర్‌బీఐ వద్ద రూ.85 వేల కోట్ల అప్పు తీసుకుందన్నారు. దీనికి అదనంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా మరికొంత తీసుకుందని, మొత్తం ఏడాది కాలంలో రుణాలు రూ.లక్ష కోట్లు దాటాయని తెలిపారు.
కాగ్ రిపోర్ట్ ప్ర కారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ నాటికి ప్రభుత్వం రూ.15,152 కోట్ల ను అప్పులు, మిత్తీలకు కట్టిందన్నారు. అంటే నెలకు రూ.2,164 కోట్లు మాత్రమే చెల్లించిందన్నారు. రేవంత్ చెప్పిన లెక్క ప్రకారం ప్ర కారం మిగతా రూ.3600 కోట్లు ఎక్కడ పో తున్నట్లో చెప్పాలని డిమాండ్ చేశారు.
20 ఫార్మా విలేజీలను రద్దు చేస్తారా?
రాష్ర్ట ప్రభుత్వం 20 చోట్ల ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తామని చెప్పిందని కేటీఆర్ గుర్తు చేశారు. అన్ని చోట్ల ఫార్మా విలేజీలను రద్దు చేస్తున్నారా? ఒక కొడంగల్‌లోనే చేస్తున్నారా? అనేది సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. భూసేకరణతోనే ఒక నగరాన్ని నిర్మించడం సాధ్యం కాదన్నారు. ఫోర్త్ సిటీ ఎందుకని, ఉన్న సిటీని నాశనం చేయకుంటే చాలని చెప్పారు.
కాళేశ్వరం లేకుండా రికార్డు స్థాయిలో పంటలు పండించినట్లు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. 2014 ముందు ఎందుకు పండించలేదని కేటీఆర్ ప్రశ్నించారు. రూ.25కోట్ల బోనస్ ఇచ్చి.. రూ.7వేల కోట్ల రైతు భరోసాను ప్రభుత్వం ఎగ్గొట్టిందన్నారు.
నాలుగేండ్ల తర్వాత సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తెలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేయడంపై కేటీఆర్ స్పందించారు. ఒక్క హరీశ్‌రావుపైన మాత్రమే కాదని, రాష్ట్రంలోని తమ నాయకత్వంపై కేసులు నమోదు చేస్తున్నారని, కానీ భయపడేది లేదన్నారు.
చరిత్ర క్షమించదు
కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే చరిత్ర క్షమించదని కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిని కేటీఆర్ హెచ్చరించారు. బుధవారం తెలంగాణ భవన్‌లోని కాళోజీ హాల్‌లో పుస్తక ప్రదర్శనను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ సీపీఆర్‌ఓ వనం జ్వాలా నరసింహరావు తన వద్ద ఉన్న వేల పుస్తకాలను తెలంగాణ భవన్‌కు డొనేట్ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రానికి ప్రతీకైన విగ్రహాన్ని పేదరికానికి చి హ్నంగా ప్రతిష్ఠించాలని అనుకోవడా న్ని తప్పుబట్టారు. కేసీఆర్ చరిత్రలో సీఎం పదవి అనేది చాలా చిన్నదని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు తన గురించి తాను చెప్పుకోవ డం ఇష్టముండదన్నారు. సమావేశం లో ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కేసీఆర్ క్లాస్‌మెట్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.