calender_icon.png 21 November, 2024 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కస్ ఫీట్లు కావు.. రైతన్నల పాట్లు!!

15-11-2024 12:15:16 AM

నిర్మల్, విజయక్రాంతి : చిత్రాలను చూసి సర్కసు ఫీట్లు అనుకుంటే పొరపాటే. నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మోతుకపల్లి, బూర్గుపల్లి గ్రామాల రైతులు పొలాలకు వెళ్లేందుకు పడుతున్న పాట్లు. కల్లూరు వాగు మీదుగా ఈ గ్రామాలకు వెళ్లేందుకు మూడేళ్ల క్రితం రూ.20 లక్షలతో వంతెన నిర్మించారు. ఆ వంతెన నాసిరకంగా ఉండటంతో ఏడాది క్రితం ఒక పిల్లరు స్లాబు కూలిపోయింది.

దీంతో వాగు అవతల ఉన్న పొలాలకు వెళ్లేందుకు ఈ గ్రామాల ప్రజలు ఇలా ప్రాణాలకు తెగించి తాడు సాయంతో, థర్మకోల్ తెప్పల సాయంతో మిషన్ భగీరథ పైప్‌ను ఉపయోగించుకుని వాగు దాటుతున్నారు. లేదంటే 6 కి.మీ.ల దూరం ప్రయాణించి పెండ్‌పల్లి మీదుగా వెళ్లాల్సి వస్తుంది. వంతెన నిర్మించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.