కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్, నవంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో వరి కోత లు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా నేటికీ కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 7,572 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం 4,598 కేంద్రాలను ప్రారంభించినట్లు పేర్కొందని, కానీ ఏ ఒక్క కొనుగోలు కేంద్రంలోనూ ఇంతవరకు కొనుగోళ్లు ప్రారంభం కాలేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు వడ్ల కుప్పలు పోసి రోజుల తరబడి ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
గత కొద్ది రోజు లుగా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడ్లు తడిసిపోయాయని తెలిపారు. ఆరుగాలం పండించిన పంటను కాపాడుకోవడం ఒక ఎత్తయితే, చేతికొచ్చిన పంటను అమ్ముకోవడం కూడా రైతులకు తలకు మించిన భారంగా మార డం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
నెల రోజులవుతున్నా వడ్ల ను కొనుగోలు చేయకపోవడం వెనుక కుట్ర దాగి ఉన్నట్లు తెలుస్తోందని, రైతులు విసిగిపోయి అడ్డికి పావుశేరుకు వడ్లను మిల్లర్లకు అమ్ముకునేలా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. తక్షణమే వడ్ల కొనుగోళ్లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా ప్రతి గింజను కొనుగోలు చేయాలని కోరారు.
అన్ని రకాల వరిధాన్యాన్ని రూ.500 బోనస్ చెల్లించి ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కోరారు. వడ్ల కొనుగోలుళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతుల పక్షాన సోమవారం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాల్లో తహసీల్దార్లకు బీజేపీ శ్రేణులు వినతిపత్రాలు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ప్రకటనలో పిలుపునిచ్చారు.