18-04-2025 12:00:00 AM
సినిమాల్లోనే కాదు ఆ మూవీకి సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో సైతం ఎప్పుడూ గ్లామర్‌తో అందరి చూపు తనవైపు తిప్పుకునే బుట్టబొమ్మ పూజ హెగ్డే. ఈ పొడుగు కాళ్ల సుందరి ఎప్పటిలా చిట్టిపొట్టి డ్రెస్సులో కాకుండా ఉన్నట్టుండీ పూర్తి కొత్త లుక్‌లో దర్శనమిచ్చింది. మొత్తం స్టుల్ మార్చేసి కనిపించీ కనిపించనట్టుగా గ్లామర్ షో చేస్తూ తన అభిమానులకు సరికొత్త ట్రీట్ ఇచ్చింది.
ఔను, పూజ హెగ్డే ప్రస్తుతం సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ‘రెట్రో’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో వరుస ఇంటర్వ్యూల్లో పూజ పాల్గొంది. ఈ సందర్భంగా చక్కగా చీరకట్టులో కనువిందు చేసిందీ బ్యూటీ. అంతేకాదు ఈ ప్రమోషన్స్‌లో ఈ ముద్దుగుమ్మ డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్రాన్స్‌ఫరెంట్ శారీలో అందాల దేవతలా దర్శనమి వ్వడం సినీప్రియులను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు ఈ ఇంట ర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు సైతం ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ఫాలోవర్స్ విషయంలో పూజ చెప్పి ముచ్చట ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్నంత మాత్రాన వాళ్లంతా సినిమాలు చూడరు అంటూ సెటైర్ వేసిందీ సొగసరి. ‘ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్నంత మాత్రాన వాళ్లంతా మన కోసం థియేటర్లకు రారు. ఉదాహరణకు ఇన్‌స్టాలో నాకు 27 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.. కానీ వాళ్లంతా నా సినిమాలు చూసేందుకు థియేటర్లకు రారు. చాలా మందికి సూపర్ స్టార్లకు 5 మిలియన్ల కంటే తక్కువ మంది ఫాలోవర్సే ఉంటారు..
కానీ వాళ్ల సినిమాలకు కోట్ల మంది వస్తుంటారు’ అంటూ నిట్టూర్చిందీ నెరజాణ. టాలీవుడ్ లో సినిమాలు ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నకు బదులుగా పూజ.. నేను ఈమధ్యే ఓ తెలుగు సినిమాకు సైన్ చేశానని చెప్పడం ద్వారా తన రీఎంట్రీ త్వరలోనే ఉండనున్న విషయం తెలియజేసింది.