వరుసగా ముగ్గురు సస్పెన్షన్
నాగర్‌కర్నూల్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): డయల్ 100 బ్లూకోర్టు విభాగంలో విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు ఒంటరిగా తిరిగే జంటల ఫొటోలను తీసి వారిని కొత్త చట్టాల పేరుతో భయభ్రాంతులకు గురిచేసి అక్రమ వసూళ్లకు పాల్పడిన విషయాన్ని విజయక్రాంతి పత్రిక వెలుగులోకి తెచ్చింది. దీంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. దీంతో నలుగురిని విధుల నుంచి తప్పించారు.
అయితే విచారణా అధికారి నిర్లక్ష్యం కారణంగా దీనికి సంబంధం లేని చిన్నయ్య అనే కానిస్టేబుల్ కూడా సస్పెన్స్‌న్‌కు గురయ్యాడు. లోతుగా విచారించి తప్పులేదని తెలిసి మళ్లీ విధుల్లోకి తీసుకన్నారు. చిన్నయ్య పేరుతో ముడావత్ రాము అనే కానిస్టేబుల్ వసూళ్లకు పాల్పడినట్లు విజయ క్రాంతి మరో కథనాన్ని ప్రచురించ గా ఉన్నతాధికారులు స్పందించారు.
రామును సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే బిజినపల్లి మండలం గంగారం గ్రామంలోని సురేష్ అనే బాధితుడు డయల్ 100 ఆశ్రయించగా న్యాయం చేస్తానంటూ వినోద్‌రెడ్డి అనే కానిస్టేబుల్ రూ.2వేలు వసూలు చేశాడు. దీన్ని విజయక్రాంతి వెలుగులోకి తేవడంతో వినోద్‌రెడ్డిపై కూడా సస్పెన్స్‌న్ వేటు పడింది.