calender_icon.png 23 October, 2024 | 5:00 PM

ఆరోపణలు కాదు.. ఆధారాలు చూపించు

23-09-2024 12:00:00 AM

  1. రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ఎవరో తేల్చుకోండి
  2. కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజం

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో అమృత్ పథకం టెండర్లలో సీఎం రేవంత్‌రెడ్డి రూ.8,888 కోట్ల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు చేయడం కాదని.. దమ్ముంటే ఆధారాలు చూపించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆలేరులో నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకా ర కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కోమటిరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. అసలు రాష్ట్రానికి అమృత్ పథకంలో రూ.8,888 కోట్లు వచ్చాయా.. లేదా అనేది తెలుసుకోవాలని అన్నారు. దోపిడీదారులకు అంతా దోపిడే కనిపిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దివాళా తీయించిన బీఆర్‌ఎస్ సర్కార్, కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభు త్వం మొదటి తేదీనే జీతాలు ఇస్తుండడంతో పాటు సంక్షేమ పథకాలు, రైతులకు రుణమాఫీ వంటివి అమలు చేస్తుంటే ఓర్వలేక అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాళేశ్వ రం ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్లు దోచుకొని, విచారణను ఎదుర్కొంటూ ఎప్పు డు ఎవరు జైలుకు వెళ్తారో తెలియని స్థితిని బీఆర్‌ఎస్ నేతలు ఎదుర్కొంటున్నారన్నారు. అసలు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఎవ రు.. మీ నాయనా? హరీశ్ రావా? లేక నీవా.. ముందు ఈ విషయం తేల్చుకో అం టూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తమ ప్రభు త్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మార్కె ట్ కమిటీ నూతన చైర్మన్ చైతన్య మహేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ మదార్‌గౌడ్, మదర్ డెయిరీ చైర్మ న్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

స్వామివారిని దర్శించుకున్న మంత్రులు

కాగా, అంతకుముందు యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామిని మంత్రులు తుమ్మల , కోమటిరెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టుగా పేర్కొన్నారు.