- రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్
- ఇండ్ల నిర్మాణానికి రూ.7వేల కోట్లు కేటాయించి.. నయాపైసా ఖర్చు చేయలేదు
- బహిరంగ లేఖలో కేంద్ర మంత్రి ధ్వజం
హైదరాబాద్, జనవరి 29(విజయక్రాం తి): రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇండ్లు, రేషన్ కార్డులను అర్హులందరికీ అందించకపోవడం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవా రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ర్టంలో 12,991 గ్రామ పం చాయతీలుండగా మండలానికొక గ్రామం చొప్పున 561 గ్రామాలను మాత్రమే ఎంపిక చేయడమేంటని ప్రశ్నించారు.
రాష్ర్ట వ్యాప్తంగా అర్హులైన 70 లక్ష ల మంది రైతులుంటే 65 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమకాకపోవడం బాధాకరమన్నా రు. 10 లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే కేవలం 20వేల మంది రైతు కూలీల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 లక్షల కొత్త రేష న్ కార్డులిస్తామని.. 42 వేల 267 మందిని మాత్రమే గుర్తించడం హాస్యాస్పదంగా వర్ణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇండ్లు లేవన్నారు.
అయితే ప్రభుత్వం మాత్రం నేటికీ ఒక్క ఇల్లు కూడా నిర్మించకపోవడం సిగ్గు చేటన్నారు. ఇండ్ల నిర్మాణం కో సం రాష్ర్ట బడ్జెట్‌లో రూ.7 వేల కోట్లకుపైగా కేటాయింపులు చేసినా నేటికీ నయాపైసా ఖర్చు చేయలేదన్నారు. రాష్ర్టం ఆవిర్భవించాక నాటి సీఎం కేసీఆర్, నేడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి హామీలను నిలబెట్టుకోలేకవడంలో విఫలమయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
కేంద్రమే ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తోందని ఈ విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలిసేలా రేషన్ షాపుల వద్ద, రేషన్ కార్డులపైన ప్రధాన మంత్రి ఫోటోను ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగం గా మంజూరయ్యే ఇండ్లకు ఆ పేరును యధాతథంగా కొనసాగించాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు.