calender_icon.png 25 January, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామసభ సజావుగా సాగలేదు: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

24-01-2025 07:28:14 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క గ్రామంలో గ్రామసభ సజావుగా సాగలేదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాక్రమంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారుల మీద టమాటాలు కోడిగుడ్లతో దాడి చేయడం వారు అధికారపక్షంలో ఉన్నారా..? ప్రతిపక్షంలో ఉన్నారా..? అని వారికి అర్థం కావడం లేదని ఏద్దేవ చేశారు. నేను హుజూరాబాద్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో గ్రామసభలో పాల్గొన్నాను. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తాం అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. సంవత్సరం అయినా ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు. గ్రామసభల ద్వారా ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారు. నియోజకవర్గానికి 3500 ఇల్లు గ్రామానికి 20 ఇల్లు వస్తే వందల మంది అర్హుల జాబితా ఎందుకు ప్రకటిస్తున్నారని ప్రశ్నించారు. 

ఆత్మీయ భరోసా పేరుతో భూమి లేని వారికి పన్నెండు వేలు ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress Govt) ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్నారు. ప్రజల పక్షాన నిలబడి అడుగుతుంటే దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. కొన్ని టీవీ చానెళ్లలో వస్తున్నట్టు నా మీద ఎవరు టమాటలతో దాడి చేయలేదని, అధికారుల మీద దాడి చేశారన్నారు. అధికారుల మీద టమాటలతో దాడి చేసే బదులు పెద ప్రజలకు పంచండి అని సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఅర్ఎస్ నేతలు నా మోచేతి నీళ్లు తాగి లక్షలు సంపాదించిన వాళ్ళే అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చక్కనపల్లి రాజేశ్వరరావు, కౌన్సిలర్లు భాస్కర్, నాయకులు వెంకటేష్, మలుగు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.