- భార్యను తాడుతో కట్టేసి బైక్‌పై ఊరంతా తిప్పిన భర్త
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
న్యూఢిల్లీ, ఆగస్టు 13: భార్య పట్ల ఓ తాగుబోతు భర్త అత్యంత కర్కశంగా వ్యవహరించాడు. తనమాట వినడం లేదని భార్య కాళ్లు, చేతులను తాడుతో బైక్‌కు కట్టి గ్రామంలోని రోడ్లపై తిప్పాడు. ఈ అమానుష ఘటనలో బాధితురాలకి తీవ్రగాయాలయ్యాయి. రాజస్థాన్‌లోని నాగౌర్‌లో ప్రేమరామ్ దంపతులు నివసిస్తున్నారు. ప్రేమరామ్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానంతో అందరికీ దూరంగా ఉంచాడు. ఈ క్రమంలో భార్య తన సోదరి వద్దకు వెళ్తానని చెప్పడంతో భర్త వద్దని వారించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఎంతచెప్పినా భార్య వినకపోవడంతో ప్రేమరామ్‌కు కోపం వచ్చి ఆమె కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి ఆ తాడును బైక్ వెనుక భాగానికి తగిలించి ఈడ్చుకుంటూ ఊరంతా తిప్పాడు. ఇంకోసారి సోదరి దగ్గరికి వెళ్తావా అంటూ కర్కశంగా ప్రవర్తించా డు. గ్రామస్థులను బాధితురాలు ఎంత ప్రాధేయపడినా ఎవరూ సాయం చేసే ందుకు ముందుకు రాలేదు. అయితే కొందరు ఈ అమానుష ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ అయ్యింది.
ఈ ఘటన నెలరోజుల క్రితం జరిగినట్లు సమాచారం. అయితే బాధిత మహిళ పోలీసులకు ఎలాంటి ఫిర్యా దు చేయలేదు. ప్రస్తుతం ఆ మహిళ తమ బంధువుల ఇంట్లో తలదాచుకున్నట్లు సమాచారం. వీడియో ఉన్నతా ధికారుల వరకు చేరడంతో స్థానిక పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు మరోలా కేసు నమోదు చేశారు. భార్యను రోడ్డుపై తాడుకు కట్టే సి తిప్పుతూ ప్రజలకు ఇబ్బందులకు గురిచేశావని అతడిపై కేసు బుక్ చేశారు.
ఈ విషయమై నెటిజన్లు పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతు న్నారు. ఒక మహిళను బైక్‌కు కట్టేసి రోడ్డుపై తిప్పుతూ పశువులా ప్రవర్తించిన భర్తపై కఠిన చర్యలు తీసుకో వాలని, ‘అతడు మనిషి కాదు మానవ మృగం’, ‘నిందితుడిని కఠినంగా శిక్షించాలి’ అని కామెంట్లు చేస్తున్నారు.