calender_icon.png 4 February, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష కాదు.. లక్షలాది డప్పులొస్తాయి

04-02-2025 01:02:21 AM

  1. 30 ఏండ్లలో ఎప్పుడూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదు.. 
  2. ఇది మా గుండె చప్పుడు వినిపించే కార్యక్రమం 
  3. సాకులతో అనుమతి నిరాకరించడం సరికాదు   
  4. సచివాలయంలో ప్రభుత్వం లక్షమందితో నిర్వహించింది
  5. హైసెక్యూరిటీ జోన్ పేరుతో అడ్డుతగిలే ప్రయత్నం
  6. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మందకృష్ణ మాదిగ

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ‘లక్ష డప్పులు.. వేల గొంతు  కార్యక్రమాన్ని తాము ప్రకటించినప్పుడు లక్ష మందికి పైగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తమకు మద్దతు తెలిపేందుకు ప్రజలు వస్తారని అంచనా వేశామని, కానీ ఇప్పుడు లక్ష కాదు.. లక్షలాది డప్పులొచ్చే పరిస్థితి ఉందని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అన్నారు.

ముప్పు ఏండ్లలో తామెప్పుడూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదని తెలిపారు. సోమాజిగూడ ప్రె  క్లబ్‌లో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మార్పీస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మందకృష్ణమాదిగ మాట్లాడుతూ ఈ నెల 7న హైదరాబాద్  నిర్వహించే లక్ష డప్పులు, వేల గొంతులు కార్యక్రమం తమ గుండె చప్పుడు వినిపించే వేదికన్నారు.

ఇది ఎవరికీ వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమం కాదని తమకు వారసత్వంగా వచ్చిన చెప్పులు కుట్టుకునే వృత్తి కనుమరుగవుతోందని, డప్పు వృత్తి కూడా కనుమరుగవుతున్న వేళ తమ డప్పు కళ అస్తిత్వాన్ని చాటుతూ, ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు.

ప్రాచీన వాయిద్యమైన తమ డప్పు కనుమరుగవుతోందని, తమ డప్పు పునరుజ్జీవనం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహి  చెప్పారు. ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి సాంస్కృతిక కార్య  జరగలేదన్నారు. కార్యక్రమానికి అనుమతి కోసం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్‌మాదిగ, తదితరులు నగర సీపీకి దరఖాస్తు చేశారని, ఆ సందర్భంలోనే తమ కరపత్రాన్ని జోడించి కార్యక్రమం విశిష్టతను చెప్పామన్నారు.

కానీ సాకులతో తమ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తమకు అనుమతి నిరాకరించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమం గిన్నీస్ బుక్ రికార్డ్స్‌లో నిలువబోతోందని, తద్వారా రాష్ట్రా  హైదరాబాద్‌కు పేరు వస్తుందన్నారు. 

30 ఏండ్లుగా ఎన్నో సభలు పెట్టాం..

ఎమ్మార్పీఎస్ 1994లో ఆవిర్భవించిందని, 1996లో హైదరాబాద్‌లో భారీ బహి  సభ ఏర్పాటు చేశామన్నారు. ఎస్సీ రిజర్వేషన్‌తో పాటు గుండెజబ్బుల పిల్లలు, ఫించన్ల సమస్యలపై ఎన్నో సభలు, కార్యక్రమాలు నిర్వహించామని, ఈ 30 ఏండ్లలో ఎప్పుడూ శాంతి భద్రతల సమస్య తలెత్తలేదన్నారు.

కానీ శాంతి భద్రతల సమస్యలు వస్తాయని, సంఘ విద్రోహశక్తులు వచ్చే అవకాశం ఉందని, ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం పేరిట పోలీసులు తమ ఆత్మగౌరవ కార్యక్రమానికి అనునమతి ఇవ్వకపోవడం సాకులు చెప్పడమేనన్నారు. తమ కార్యక్ర  సీఎంకు ఇష్టం లేదమోనని, లేదంటే అనుమతి వచ్చేదని విమర్శించారు. సోమవారం కూడా తమ బృందం మరోసారి సీపీ  కలిసి అనుమతి కోసం దరఖాస్తు చేస్తామన్నారు. 

మీకో న్యాయం.. మాకో న్యాయమా? 

తమ సభ సచివాలయం, అసెంబ్లీకి చేరువలో నిర్వహించడం వల్ల హైసెక్యూరిటీ జోన్‌లో, వీఐపీలు, ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని పోలీసులు సాకులు చెబుతున్నారన్నారు. డిసెంబర్ 9న సచివాల   లక్షమందితో సభ నిర్వహించినట్లు ప్రభుత్వ పెద్దలే ప్రకటించారని, వారికి లేని సమస్య తమతోనే వస్తుందా అని ప్రశ్నించారు.

సీఎం ప్రత్యేక చొరవ తీసుకొని తమ కార్యక్రమానికి అనుమతివ్వాలని డీజీపీ, సీపీలకు ఆదేశాలివ్వాలని కోరారు. తమ కార్య్ర  సంఘ విద్రోహ శక్తులు చొరబడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారని, వారికి ఉన్న ఇంటలిజెన్స్ సమాచారంతో విద్రోహ శక్తులను గుర్తించి, అదుపులోకి తీసుకోవాలని సూచించారు.

అనం  కార్యక్రమానికి సంఘీభావంగా మాది  ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో డప్పు చాటింపు వేశారు. మేలుకో ఓ మాదిగ అనే పాటల సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమం  పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.