calender_icon.png 13 January, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భరోసా కాదు.. బాకీ పడ్డ ప్రభుత్వం

19-07-2024 01:05:25 AM

మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి 

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో భరోసా ఇచ్చిన  ప్రభుత్వం కాకుండా, ప్రజలకు బాకీ పడ్డ ప్రభుత్వం నడుస్తోందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. అబద్దాలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ అవే అబద్దాలతో పాల న సాగిస్తోందని, రూ.6వేల కోట్లతో రుణమాఫీ ఏ విధంగా పూర్తవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రచారానికి గోబెల్స్ కూడా మూర్చపోతారని, యాసంగి రైతు బంధు లోనే రూ. 2 వేల కోట్లు ఎగ్గొట్టారని, రైతు భరోసా ప్రకారం చూస్తే  రూ. 6వేల కోట్లు ఎగ్గొట్టారని మండిపడ్డారు. 

వానాకాలం రైతు భరోసా ఊసేలేదు, కోటి 30 లక్షల ఎకరాలకే ఇస్తారనుకున్నా రైతులకు ఎకరాకు రూ.7,500 చొప్పున రూ.10వేల కోట్లు ఎగ్గొట్టాని, రుణమాఫీ అం టూ ఇప్పడు రూ.6 వేల కోట్లు ఇచ్చి, రూ.10వేల కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టారని ఒక ప్రకటనలో విమర్శిం చారు. ప్రభుత్వం రాష్ట్రంలో  కోటి 73లక్షల మంది మహిళలకు ఏడు నెలలుగా నెలకు రూ.2500 చొప్ప న బాకీ పడిందని, 40లక్షల మంది పించన్‌దారులు, దివ్యాంగులకు ౭ నెలలుగా నెలకు రూ.2 వేల చొప్పన బాకీ పడిందన్నారు. కోటి 30 లక్షల టన్నుల వరి ధాన్యానికి క్వింటాలకు రూ. 500 చొప్పున రూ. 6500 కోట్ల బోనస్ ఇవ్వలేదన్నారు.