calender_icon.png 5 October, 2024 | 4:57 AM

మొనగాడు కాదు.. మోసగాడు

05-10-2024 02:06:19 AM

ఒక్క హామీని నెరవేర్చని సీఎం రేవంత్ 

కూల్చుడు తప్ప కట్టుడు తెల్వదు 

దసరాలోగా రైతు రుణమాఫీ చేయాల్సిందే

లేదంటే ఢిల్లీలో రాహుల్ ఇంటిని ముట్టడిస్తాం

తొర్రూరు రుణమాఫీ ధర్నాలో మాజీ మంత్రి హరీశ్‌రావు

హనుమకొండ, అక్టోబర్ 4 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి మొనగాడు కాదు మోసగాడని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, దేవుళ్లపై ఒట్టుపెట్టీ మరీ అన్ని వర్గాలను మోసం చేశాడని మం డిపడ్డారు.

ఇక నుంచి ఎనుముల రేవంత్‌రెడ్డిని ఎగవేతల రేవంత్‌రెడ్డి అని పిలువాలని ఎద్దేవా చేశారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటూ శుక్రవారం మహబూ బాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో పది వేల మంది రైతులతో నిర్వహిం చిన ధర్నాలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు.

దసరాలోగా రైతులందరికీ రుణమా ఫీ చేయకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని, అసెంబ్లీ సమావేశాలను స్తంభింపచే స్తామ టని హెచ్చరించారు. అంతేకాకుండా ఢిల్లీలో రాహూల్‌గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిం చారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ, వృద్ధులకు రూ.4వేల పింఛన్, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయంతోపాటు ఆ టరు గ్యారంటీలను అమలు చేస్తే రాజీనా మా చేస్తానంటూ తాను సవాల్ చేసిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తు చేశారు.

ఆగస్ట్ 15 నాటికి రుణమాఫీ చేస్తామని చెప్పి మొదట రూ.49 వేల కోట్లు అని, ఆ తర్వాత 31 వేల కోట్లు అని చెప్పి చివరకు రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు. తొర్రూరు మండలంలో 11,000 మంది రైతులు అప్పు తెచ్చుకుంటే ఐదువేల మందికే మాఫీ అయిందన్నారు. 

రేవంత్‌రెడ్డి బ్రోకర్: ఎర్రబెల్లి

రేవంత్‌రెడ్డి తన శిష్యుడేనని, కానీ బ్రోకర్ మా టటలు చెప్పి కేసీఆర్‌ను ఓడించాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దు య్యబట్టారు. రైతులకు 50% కూడా రుణమా టఫీ జరగలేదన్నారు. రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. రైతులను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు.

కార్యక్రమం లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ మలో తు కవిత, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, తాటికొండ రాజయ్య పాల్గొన్నారు.

పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోం

హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోబోమని హరీశ్‌రావు హెచ్చరించారు. ప్రజల నుంచి నిరసన వచ్చినప్పు డు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మం డిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులను రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.

ఈ పాపాత్ముడిని క్షమించి, ప్రజలను కాపాడాలని యాదగిరి నర్సన్నకు మొక్కితే తనపై కేసు పెట్టిండని ఆరోపించారు. పాలకుర్తికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని, అయినా అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు.  తొర్రూరు పట్టణంలో రైతుల తో హరీశ్‌రావు ముచ్చటించారు. రుణం ఎంత ఉన్నది? ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? రుణమాఫీ కాకపోవడానికి అధికారులు ఏం చెప్తున్నారు? వంటి విషయా లను అడిగి తెలుసుకున్నారు.