calender_icon.png 5 October, 2024 | 8:40 AM

కమిషనర్ కాదు.. కమీషన్ల రాజా!

05-10-2024 02:14:16 AM

వసూల్ రాయుడితో కుమ్మక్కు

దోచుకున్నరు.. మెల్లగా జారుకున్నరు  

మంథనిలో నష్టపోయిన ప్రజలు

మంథని, అక్టోబర్ 4 (విజయక్రాంతి): ఆయన కమిషనర్ కాదు. కమీషన్ల రాజా. ఆయనకు వసూల్ రాయు డు తోడు కావడంతో మంథనిలో అందినకాడికి దోచుకు న్నారు. ఏడాది క్రితం మంథని మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన గుట్టల మల్లికార్జునస్వామి తాను ఆడిందే ఆట, పాడి ందే పాటగా సాగించారు. కొంతమందిని కోవర్టులతో కలిసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిని బెదిరిం చి రూ.లక్షల్లో దోచుకున్నారు. 

కోర్టు తీర్పుతో వసూళ్ల పర్వం

మంథనిలో అక్రమ ఇళ్ల నిర్మాణాలపై కమిషనర్ కోవర్టు, మంథని మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సత్యనారాయణ కోర్టులో కేసు వేయగా.. కోర్టు అక్రమ నిర్మాణలను కూల్చలంటూ తీర్పునిచ్చిందని, ఆర్డర్ ప్రతిని చూపు తూ కమిషనర్ మల్లికార్జునస్వామి, ఇనుముల సత్యనారాయణ ఇద్దరు కలిసి వసూళ్లకు తెరలేపారని తెలిసింది.

అక్రమ నిర్మాణాదారులతో చర్చలు జరుపగా, కొలిక్కి రాకపోవ డంతో కోర్టు తీర్పు ఉన్నదదంటూ పోలీస్, రెవెన్యూ అధికారులతో కలి సి ఉన్నట్టుండి అక్రమంగా ఇండ్లు నిర్మించుకున్నారంటూ పేదల ఇండ్లను కమిషనర్ జేసీబీ సహాయంతో పాక్షికంగా కూల్చివేశారు. ఉన్నత కుటుంబాల వారు అక్రమంగా ఇండ్లు నిర్మించుకున్నా వారి జోలికి పోకుం డా పేదవారి పైనే కక్షకట్టారు.

ఖంగుతిన్న ఇంటి యజమానులు కోర్టుకుపోయి స్టే తెచ్చుకున్నారు. ఆ తర్వాత కమిషనర్, మాజీ ఉప సర్పంచ్‌తో కలిసి ఇంటి యజమానులతో చర్చించి రూ.లక్షల్లో దోచుకున్నారని సమాచారం. ఒక్కొక్క ఇంటి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు దండుకున్నట్లు తెలిసింది.

ఈ ఇద్దరి వ్యవహారం ఆ నోట ఈ నోట పాకి మంథని పట్టణమంతా వ్యాపించింది. మంథనిలో పేదవాడు ఇల్లు నిర్మించు కోవాలంటే మున్సిపల్ చైర్మన్ వద్దకో, మంత్రి వద్దకో పోనవసరంలేదని, తామే చూసుకుంటామని, తమకే డబ్బులు ఇవ్వాలని వారు ఇరువురు చెప్పినట్లు కొంద రు బాధితులు విజయక్రాంతితో తెలిపారు. వారిని నమ్మిన కొందరు రూ.లక్షల్లో సమర్పించారని తెలుస్తున్నది.

కనిపించకుండాపోయిన ఇనుముల!

మంథని పట్టణానికి చెందిన మల్లారెడ్డి తాను ఇల్లు నిర్మించుకుంటే ఇనుముల రూ.5 లక్షలు ఇవ్వాలని బెదిరించాడని మంథని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఇనుముల వసూల్ బాగోతం బయటకు వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్కరు బయటకు వచ్చి పోలీస్‌లకు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. దీంతో ఇనుములపై ఆరు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కమీషన్‌ల వ్యవహారం కమిషనర్ మల్లికార్జున్‌స్వామి మీదికి వచ్చింది. ఇనుముల ఫిర్యాదు చేస్తే కమిషనర్ ఇండ్లు కూల్చాడని తెలిసి పట్టణ ప్రజలు అవాక్కయారు. తనపై నమోదైన కేలసులకు భయపడిన ఇనుముల పోలీసులకు కనిపిస్తే అరెస్టు చేస్తారని తెలిసి కనిపించకుండా పోయినట్టు తెలుస్తున్నది.

కమీషన్ల కమిషనర్ సరెండర్

మంథని కమిషనర్ మల్లికార్జున స్వామిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హైదరాబాద్ మున్సిపల్ ఆఫీసుకు సరెండర్ చేస్తూ గత ప ది రోజుల క్రితం ఉత్తుర్వులు జారీ చేశారు. దీంతో మంథని పట్టణ ప్రజలు ఆనందపడ్డారు. మంథనిలో వసూల్‌రాయుడు ఇనుములపై కేసులు నమోదు కావడంతో పట్టణంలో మిగిలిన వసూల్ రాయుళ్లు పూర్తిగా సైలెంట్ అయ్యారని తెలుస్తున్నది.

పోలీసులు వసూల్‌రాయుళ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో అభయం ఇస్తున్నారు. ఎవరికి భయపడవద్దని, అండగా ఉంటామని, ఎవరైనా బెదిరించి డబ్బులు అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, మంథని సీఐ, ఎస్సైలు భరోసా ఇస్తున్నారు.