calender_icon.png 26 December, 2024 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎడ్యుకేషన్ హబ్‌గా ఉత్తర తెలంగాణ

08-10-2024 12:36:58 AM

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి 

కుమ్రంభీంఆసిఫాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఉత్తర తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ పట్టణంలో ఓటరు అవగాహన కార్య క్రమంలో భాగంగా జిల్లా గ్రంథాలయం, బార్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.

ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. సాయిబాబ దేవాలయంలో పూజలు నిరహించారు. బీఆ ర్ అంబెద్కర్, కుమ్రం భీం విగ్రహాలకు నివాళులర్పించారు. తన ను గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి సేవకుడిలా పని చేస్తానన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువతకు స్టడీ మెటీరియల్‌తో యాప్‌ను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ యాప్‌ను 15 రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. గెలిస్తే 4 ఉమ్మడి జిల్లాల్లో ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తానని వెల్లడించారు.