calender_icon.png 29 September, 2024 | 5:53 AM

ఈశాన్య రాష్ట్రాలు కళావైభవానికి ప్రతీక

29-09-2024 01:23:16 AM

  1. రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్ 
  2. ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 

హైదరాబాద్/సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): హైదరాబాద్ బొల్లారంలో ని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక కళా ప్రదర్శనతోపాటు జియోగ్రాఫికల్ ఇండెక్స్ స్టాల్స్, సాంకేతిక పరిజ్ఞానంతో యువత ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను రాష్ట్రపతి తిలకించారు.

అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాలు సాంస్కృతిక, కళా వైభవానికి ప్రతీక అని కొనియాడారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాలు ఒక్కొక్కటి ఒక్కో వజ్రపు తునక అ ని అన్నారు. ప్రకృతి సౌందర్యానికి, విలక్షణ కళలకు ఈశాన్య రాష్ట్రాలు నెలవు అని చెప్పా రు.

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. దేశం సాంస్కృతికంగా భిన్నత్వంలో ఏకత సాధించగల శక్తీ భారతీయతలో మాత్రమే ఉందన్నారు. రాష్ట్రపతి చొరవతో ఏర్పాటైన మహోత్సవ్ ఈశాన్య సాంస్కృతిక వైభవాన్ని పరిపుష్టం చేసి, వివిధ రాష్ట్రాల సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేస్తుందని చెప్పారు.

సేంద్రి య సాగు రంగంలో ఘననీయ మైన ప్రగతి సాధించాయన్నారు. ఈ రాష్ట్రాల నుంచి ఇత ర ప్రాంతాలు ప్రేరణ పొందగలవని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏడు రాష్ట్రాల గవర్నర్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది శాఖ సహాయ మంత్రి సుఖాంత మజుందార్, రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. 

రాష్ట్రపతి ఒక్కరోజు పర్యటన బిజీబిజీ  

రాష్ట్రపతి పర్యటన ముగిసింది. ఒక రోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి పర్యటన ఆసాంతం బిజీబిజీగా సా గింది. శనివారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ద్రౌపది ముర్ముకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట్‌లో నల్సార్ లా వర్సిటీ 21వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అటునుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకు ని, భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించారు. హకీంపేట్ ఎయిర్ బేస్‌లోనూ పర్యటించారు. అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు.