- వారి నైతిక మద్దతు గర్భిణులకు చాలా అవసరం
- కిమ్స్ కడల్స్ ఆస్పత్రి వైద్య నిపుణుల వెల్లడి
- కిమ్స్ కడల్స్ గచ్చిబౌలిలో ఘనంగా మామ్ టు బి కార్నివాల్ --2025
- గర్భిణులు, వారి భర్తలతో వినూత్న కార్యక్రమం
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (విజయక్రాంతి): మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవించేవరకు, ఆ తర్వాత కూడా భర్తల నైతిక మద్దతు చాలా అవసరమని గచ్చిబౌలి కిమ్స్ కడల్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ గైనకాలజిస్టులు, హైరిస్క్ ప్రెగ్నెన్సీ నిపుణులు తెలిపారు.
సోమవారం ఆ ఆస్పత్రిలో కన్సల్టెంట్ గైనకాలజిస్టు, ఆబ్స్టెట్రీషియన్, లాప్రోస్కొపిక్ సర్జన్ డాక్టర్ డీఎస్ నిఖితారెడ్డి, డాక్టర్ కావ్యప్రియ వజ్రాల, డాక్టర్ సాహితీ బల్మూరి ఆధ్వర్యంలో ‘మామ్ టు బి కార్నివాల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గచ్చిబౌలిలోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
తమ ఆస్పత్రిలో క్లిష్టమైన ప్రసవాలకు వసతులు ఉన్నాయని, డెలవరీ సమయంలో ఎక్కువగా రక్తస్రావం అయినప్పుడు గర్భసంచి తొలగించాల్సి అవసరం లేకుండా (యూట్రైన్ ఆర్ట్రీ ఎంబోలైజేషన్) పద్ధతితో గర్భసంచిని కాపాడే అవకాశం ఉందని వివరించారు. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలను రక్షించడానికి లెవల్ ఫోర్ ఎన్‌ఐసీయూల సౌకర్యం ఉందని తెలిపారు.
ఇక్కడ 700 గ్రాముల కంటే తక్కువ బరువుతో పుట్టిన శిశువులను విజయవంతంగా చికిత్సనందించి కాపాడా మని తెలిపారు. గర్భం దాల్చినట్టు తెలిసినప్పటి నుంచి భర్తలు తమ భార్యలను అనుక్షణం కనిపెట్టుకుని ఉండడంతోపాటు వారికి అన్నిరకాలుగా మద్దతుగా నిలువాలని సూచించారు.
నొప్పు లు భరించలేరన్న భయంతోనో, లోపల బిడ్డ నలిగిపోతుందన్న ఆందోళనతోనో ఎందుకొచ్చిన ఇబ్బం దని కొందరు సిజేరియన్ చేయాలని అడుగుతున్నారని వెల్లడించారు. ఫలానా ముహూర్తానికే తమ బిడ్డ పుట్టాలని కోరుకుంటూ, ఆ సమయానికి పుట్టేలా సిజేరియన్ చేయాలని పలువురు కోరుతున్నారని తెలిపారు. ఇలాంటివి సరికాదని, మహిళ ఆరోగ్యం దృష్ట్యా చూసినా, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా చూసినా సాధారణ ప్రసవమే మంచిదని పేర్కొన్నారు.