16-04-2025 12:00:00 AM
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 15 ( విజయక్రాంతి ): ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గర్భవతి పురిటినొప్పులతో బాధపడుతూ బస్సులోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ఆదిరాల గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది కొల్లాపూర్ నియోజక వర్గం ఎల్లూరు గ్రామానికి చెందిన సువర్ణ ఆశా వర్కర్ మల్లికాంతమ్మతో కలిసి వైద్య పరీక్షల కోసం నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రికి వచ్చారు.
వైద్య పరీక్షల అనంతరం తిరిగి హైదరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో కొల్లాపూర్ వెళ్తుండగా ఆదిరాల గ్రామ సమీపంలో పురిటినొప్పులు అధికమవడంతో కండక్టర్ రాజ్ కుమార్, డ్రైవర్ వేణుగోపాల్ సహకారంతో ఆశా వర్కర్ గర్భిణీకి సాధారణ ప్రసవం జరిపించారు. అనంతరం 108 సాయంతో తల్లి బిడ్డల ఇద్దరిని కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ప్రయాణికులు తెలిపారు.