calender_icon.png 22 December, 2024 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘లే లే రాజా’ అంటున్న నోరా ఫతేహి

15-10-2024 12:00:00 AM

వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు కరుణ కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘మట్కా’. పాన్ ఇండియా చిత్రంగా ఇది రూపొందుతోంది. మీనాక్షి చౌద రి, నోరా ఫతేహి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముం దుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను జోరుగా సాగిస్తోంది. ఈ క్రమంలోనే చిత్రం నుంచి తొలి పాట ‘లే లే రాజా’ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూర్చిన ఈ గీతాన్ని నీతి మోహన్ ఆలపించారు. ఈ పాట లో నోరా ఫతేహి తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు.