calender_icon.png 15 November, 2024 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు

13-11-2024 04:04:11 PM

ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండానే కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు విడ్డూరం

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్

నిజామాబాద్ (విజయ క్రాంతి): రైతులకు ఇచ్చిన ఏ హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చకుండానే కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు చేయనున్న ధర్నాకు బిజెపి తరఫున పూర్తి మద్దతు తెలుపుతామన్నారు. కేసిఆర్ ఇచ్చిన వాగ్దానాలు లాగే కాంగ్రెస్ నాయకులు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చడం లేదన్నారు.

రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని పూర్తి స్థాయిలో చేయలేదన్నారు. రైతులకు ఇస్తామన్న రైతుబంధు ఇవ్వలేదన్నారు. సన్నబియ్యానికి 500 బోనాలు తీస్తామని ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద తులం బంగారం ఇస్తామన్న విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోయిందన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల రోజు రోజుకు ద్వేషం పెరుగుతుందన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తెస్తే కొర్రీలు పెడుతూ  రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసిఆర్ బాటలో నడవవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ధాన్యంకు సంబంధించిన డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు.