‘చదువుకోకపోతే గాడిదలు కాయాల్సి వస్తుంది’ అంటూ పెద్దలు పిల్లలను
మందలించడం సహజమే. ‘గాడిదలు కాయడం కూడా ఓ మంచి లాభసాటి
వ్యాపారమేనని’ గుజరాత్‌కు చెందిన ధరేన్ సోలంకీ అనే యువకుడు నిరూపించాడు.
గాడిదల పెంపకంతో అతను ఇప్పుడు నెలకు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాడు మరి. ధీరేన్ చాలా కాలం పాలు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అయినా లాభం లేకపోయింది. కొన్నాళ్లు కొన్ని ప్రైవేటు కంపెనీ ల్లో పని చేశాడు కానీ, అవేవీ ఆర్థికంగా అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. దీంతో కొత్త ఉపాధి అవకాశాలను అన్వేషించాడు. దక్షిణ భారత దేశంలో గాడిదల పెంపకానికి క్రమంగా డిమాండ్ పెరుగుతోందని తెలుసుకున్నాడు. కొంతమందిని కలిసి విషయాలు తెలుసుకున్నాడు. అదే క్రమంలో గాడిదలు పెంచడమేమిటంటూ కొందరు అతణ్ణి నిరుత్సాహ పరిచారు. కానీ, అతను ఇవేవీ పట్టించుకోలేదు. ఎనిమిది నెలల క్రింత సొంత ఊళ్లోనే గాడిదల ఫామ్‌ను ప్రారంభించాడు. రూ.22 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. ఇప్పుడు అవి 42 గాడిదలయ్యాయి. ‘గాడిదలతో ఏం ఆదాయం వస్తుంది’ అన్న అనుమానం ఎవరికైనా రావ చ్చు. గాడిదల పాలను దక్షిణాదిలో కస్టమర్లకు విక్రయించడం ద్వారా నెలకు రూ. రెండు, మూడు లక్షల దాకా సంపాదిస్తున్నానని ధీరేన్ గర్వంగా చెప్తున్నాడు.
‘గాడిద పాలకు అంత డిమాండ్ ఉందా?’ అన్న సందేహం కూడా మనకు రావచ్చు. సౌందర్య ఉత్పత్తుల తయారీలో గాడిద పాలను వినియోగిస్తారు. ఈ ఉత్పత్తులను తయారుచేసే వాళ్లు గాడిద పా లను కొనుగోలు చేస్తున్నారు. కర్నాటక, కేరళ రాష్ట్రాలకు ఈ పాలను సరఫరా చేస్తున్నట్లు అతను చెప్తున్నాడు. అంతేకాదు, ఇన్‌ఫెక్షన్లు, కోరింత దగ్గు, వైరల్ జ్వరాలు, ఆస్తమాకు కూడా గాడిద పాలు ఔషధంగా ఉపయోగపడతాయని చెబుతు న్నారు. చాలా విటమిన్లు పుష్కలంగా ఉం డే గాడిద పాలు ఆరోగ్యానికి కూడా మం చివట. అందుకే, ప్రజలు లీటరు రూ.7 వేలకు కొంటున్నట్లు అతను చెప్తున్నాడు.
గ్రాడ్యుయేట్ టీ స్టాల్
ఇతనే కాదు, నేటి యువత ఆదాయ మార్గాల అన్వేషణలో దేన్నికూడా నామోషీగా ఫీల్ కావడం లేదు. పోస్టు గ్రాడ్యు యేట్లు, ఇంజినీరింగ్ చదివిన వారు ఎంతోమంది వినూత్న రీతిలో చాయ్ దుకాణాలు నడుపుతూ రూ. లక్షలు సం పాదిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం లభించక పోవడంతో పాట్నాలో ప్రియాంక గుప్తా అనే ఓ ఎకనమిక్ గ్రాడ్యుయేట్ యువతి సొంతంగా టీ వ్యాపారం ప్రారంభించింది. ఇప్పుడు ఆమె వ్యాపారం కస్ట మర్లను పెద్ద సంఖ్యలో ఆకట్టుకుంటోంది. అహ్మదాబాద్‌లో టీ స్టాల్ నడుపుతున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్ ప్రఫుల్ బిల్లోర్‌ను ఆమె తన రోల్ మోడల్‌గా చెబుతున్నది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రియాంక ‘పీనాహీ పడేగా’,‘సోచ్‌మత్.. చాలూ కర్‌దే బాస్’ లాంటి పంచ్‌లైన్లను కూడా వాడుకుంటోంది. అయితే, టీస్టాల్‌ను ప్రారం భించడం అంత సులభమేమీ కాదని ప్రియాంక చెప్తోంది. ముద్రా పథకం కింద రుణం పొందడం కోసం తాను చాలా బ్యాంకులకు తిరిగానని, ఎవరూ ముందు కు రాలేదని చెప్తోంది.
చివరికి తన ఫ్రెండ్ ఆర్థిక సాయం చేయడంతో పాట్నా మహిళా కళాశాల దగ్గర టీస్టాల్‌ను రెండేళ్ల క్రితం ప్రారంభించింది. వ్యాపారం అర్థం చేసుకోవడానికి రెండు నెలలపాటు చాలా టీ దుకాణాలు తిరిగానని, మార్కెట్ రిసెర్చ్ కూడా చేశానని ఆమె చెప్తోంది. తాను టీ దుకాణం ప్రారంభించడానికి యత్నించినప్పుడు చాలామంది తనను నిరుత్సాహ పరచడానికి ప్రయత్నించారనీ ఆమె చెప్తోంది. తన దుకాణంలో రకరకాల చాయ్‌లు ఆఫర్ చేసే ప్రియాంక ఇప్పుడు ఓ మంచి ఉద్యోగంలో వచ్చేంత ఆదాయం పొందడమే కాకుండా పదిమందిలో గర్వంగా తలెత్తుకుని నిలబడింది.
పండ్ల గ్రామం
పండ్ల గ్రామంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన మహారాష్ట్రలోని ధుమల్‌వాడీ విజయగాథే వేరు. ఒకప్పుడు దుర్భిక్షం రాజ్యమేలిన ఆ గ్రామాన్ని ఇప్పుడు ‘లక్షాధికారుల పల్లె’ అని కూడా పిలుస్తారు. కూలీ నాలీ చేసుకుని బతికే పరిస్థితి నుంచి ఎంతోమందికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగిన ఆ గ్రామం ఇప్పుడు పండ్ల తోటలకు ప్రసిద్ధి. సీజన్‌నుబట్టి రకరకాల పండ్లు పండించే ఆ ఊరి ఆదాయం ఇప్పుడు ఏడాదికి 50 కోట్ల పైమాటే. ఆ గ్రామస్థులు ఇప్పుడు బయటి రాష్ట్రాలకే కాదు, విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. అందుకే, గ్రామంలో ఎంతోమంది యువకులు మంచి చదువులే చదువుకున్నా ఉద్యోగాల కోసం ప్రయత్నించకుండా ఉన్న ఊళ్లోనే వ్యవసాయం చేసుకుంటున్నారు. తాము చదివిన చదువులను సార్థ కం చేసుకుంటూ కొత్త విధానాలతో ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. కాయకష్టం చేసుకునే రైతులకు పిల్లనివ్వడానికి ఇప్పు డు ఎవరూ ఇష్టపడరన్న అపవాదును పోగొడుతూ ధుమల్‌వాడీ యువకులను అల్లుళ్లుగా చేసుకునేందుకు పోటీ పడే స్థితి ఏర్పడింది.