calender_icon.png 9 October, 2024 | 10:05 AM

‘సుప్రీం’లో నాన్‌వెజ్ పంచాయితీ

08-10-2024 01:29:59 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: సుప్రీం కోర్టు క్యాంటీన్‌లో ఇటీవల మాంసాహార వంటకాలను పునఃప్రారంభిం చడంపై తీవ్ర వివాదం చెలరోగుతోంది. నవరాత్రి ఉత్సవాల నేప థ్యంలో నాన్‌వెజ్ వంటకాలకు ఎలా అనుమతి ఇస్తారంటూ ఓ వర్గం న్యా యవాదుల బృందం నిరసన తెలిపింది. ఈ విషయమై  సీనియర్ న్యా యవాది రజత్ నాయర్ సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్, సుప్రీం కోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్‌కి లేఖ రాశారు.

ఇతర బార్ సభ్యుల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా మళ్లీ క్యాంటీ న్ లో నాన్‌వెజ్ ఫుడ్ ఎలా తీసుకువస్తారని.. ఇది ఏకపక్ష నిర్ణయం అని లేఖలో ప్రస్తావించారు. ఆయన రాసిన లేఖను అత్యున్నత న్యాయస్థానంలో ప్రాక్టీస్ చేస్తు న్న 133మంది న్యాయవాదులు కూడా సమర్ధించారు. నవరాత్రి ఉత్సవాల సంద ర్భంగా ఇటీవల క్యాంటీన్‌లో మాం సాహారాన్ని నిషేధించారు. అయితే దీనికి వ్యతిరేకంగా ఓ వర్గం న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు.