calender_icon.png 25 November, 2024 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగని పుత్తడి పరుగు

24-11-2024 12:00:00 AM

  1. 6 రోజుల్లో రూ.4,000 జంప్
  2. హైదరాబాద్‌లో రూ.79,500పైకి తులం ధర

హైదరాబాద్, నవంబర్ 23: ప్రపంచ ట్రెండ్‌ను అనుసరిస్తూ దేశంలో కూడా పుత్తడి పరుగు కొనసాగుతున్నది. బంగారం ధర వరుసగా ఆరో రోజూ పెరిగి, రెండు వారాల గరిష్ఠస్థాయికి చేరింది.  హైదరాబా ద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర  మళ్లీ రూ.79,000 స్థాయిని దాటేసింది.

శనివారం మరో రూ.820 పెరిగి రూ.79,640 వద్ద నిలిచింది.  వరుసగా ఆరు రోజుల్లో ఇది దాదాపు రూ.4,000కుమేర పెరిగింది.  తాజాగా హైదరాబాద్ బులి యన్ మార్కెట్లో  22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర మరో రూ.750 పెరిగి రూ.73,000 వద్దకు చేరింది. 

ప్రపంచ మార్కెట్లో ఒకే రోజున 40 డాలర్లు పెరిగిన పసిడి

వచ్చే ఏడాది యూఎస్ అధ్యక్ష పదవి చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక మంత్రిగా ప్రసిద్ధ ఇన్వెస్టర్ స్కాట్ బీసెంట్‌ను ఎంపికచేసినట్లు వార్త వెలువడటంతో శుక్రవారం బంగారం ప్రపంచ మార్కెట్లో భారీగా పెరిగింది. ఈ ఒక్కరోజులోనే ఔన్సు బంగారం ఫ్యూచర్ ధర 40 డాలర్ల మేర ఎగిసి 2,718 డాలర్ల గరిష్ఠస్థాయిని చేరింది.

అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్  విజయంతో  బంగారం ధర భారీగా క్షీణించినప్పటికీ, ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రతరంకావడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ సమీక్షలో మరో పావుశాతం వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు పసిడి ధరను పరుగులు తీయిస్తున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధి తెలిపారు.